ఆ పథకంలో రూ. 4లక్షలు రాయితీ.. రైతులకు భారీ శుభవార్త!
తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందిస్తోంది. తాజాగా వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పురుగు మందులు, సూక్ష్మ పోషకాల పిచికారీకి డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
ఆ కేంద్ర పథకం ద్వారా రైతులకు లబ్ది చేకూర్చనున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతుల అవసరాలను గుర్తించి, వారి విజ్ఞప్తి మేరకు, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ డ్రోన్లను రాయితీపై అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం అందిస్తున్న 'సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం)' పథకం కింద వివిధ వ్యవసాయ యంత్రాలను రైతులకు రాయితీపై అందించనున్నారు.

ఒక్కో డ్రోన్‌పై 40% సబ్సిడీ
ప్రభుత్వం ఇచ్చే రాయితీ కింద చిన్న, సన్నకారు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), మహిళా రైతులకు ఈ డ్రోన్లు అందుబాటులో ఉంటాయి. తొలి దశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 10 చొప్పున డ్రోన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో డ్రోన్‌పై 40% సబ్సిడీ ఇవ్వనున్నారు. అంటే గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీ అందనుంది. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు సైతం ఈ డ్రోన్లు అందిస్తారు.
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో బెనిఫిట్ ఇదే
డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70% నుంచి 80% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎరువులు, సూక్ష్మపోషకాలు సమానంగా పంటకు ఈ విధానంలో అందుతాయని మంత్రి తుమ్మల వివరించారు. కూలీల ఖర్చులు తగ్గి రైతులకు లాభాలు వస్తాయన్నారు. ఆధునిక టెక్నాలజీని రైతు సంఘాలకు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఎలా అప్లై చేసుకోవాలో చెప్పిన మంత్రి
డ్రోన్ల వినియోగంతో సమయం ఆదా అవ్వటమే కాకుండా, రైతులకు ఖర్చు తగ్గుతుంది కాబట్టి రైతులు కూడా వీటి వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. ఎస్ఎంఏఎం పథకం అర్హతలు, రాయితీ శాతం, దరఖాస్తు విధానం వంటి అన్ని వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాల్లో లభిస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే 9,936 వ్యవసాయ యంత్రాలకు రాయితీ
2025-26 సంవత్సరంలో ఇప్పటికే 9,936 వ్యవసాయ యంత్రాలకు రూ.28.74 కోట్ల రాయితీ అందించామని ఆయన తెలిపారు.మిగిలిన పరికరాలను రాబోయే 10-15 రోజుల్లో రైతులకు అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications