హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వలింగ సంపర్కానికి నాగరాజు ఒత్తిడి, కొట్టా, చచ్చిపోయాడు: సుక్రు

స్వలింగ సంపర్కానికి నాగరాజు ఒత్తిడి చేయడం వల్లనే హత్య జరిగినట్లు ఇప్పటి వరకూ లభించిన సాక్ష్యాల ఆధారంగా గుర్తించామని పోలీసులు చెప్పారు. డ్రైవర్‌తో వెంకట్‌ సుక్రుతకు అంతకు ముందు నుంచీ హోమో సెక్స్‌ .

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్వలింగ సంపర్కానికి నాగరాజు ఒత్తిడి చేయడం వల్లనే హత్య జరిగినట్లు ఇప్పటి వరకూ లభించిన సాక్ష్యాల ఆధారంగా గుర్తించామని పోలీసులు చెప్పారు. డ్రైవర్‌తో వెంకట్‌ సుక్రుతకు అంతకు ముందు నుంచీ హోమో సెక్స్‌ సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు నిందితుడిని వైద్య పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు.

మంగళవారం రాత్రి హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ బి.లింబారెడ్డి, బంజారాహిల్స్‌ ఏసీపీ నోముల మురళీలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం - మద్యం మత్తులో తనతో స్వలింగ సంపర్కాని (హోమో సెక్స్‌)కి సహకరించాలని డ్రైవర్‌ నాగరాజు ఒత్తిడి చేశాడు. అందుకు విముఖత వ్యక్తం చేసిన ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వరరావు కొడుకు వెంకట్‌ సుక్రుత్ ఇటుక రాయితో కొట్టాడు. దాంతో, డ్రైవర్‌ నాగరాజు మరణించాడు.

హత్య తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు కొడుకుకు ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర రావు సహకరించారు. దీంతో ఐఏఎస్‌ అధికారి ధారవత్తు వెంకటేశ్వరరావు (55), ఆయన కొడుకు డి.వెంకట్‌ సుక్రుత (19)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

మృతదేహాన్ని తరలించేందుకు సాయపడిన మరో ముగ్గురు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. దర్యాప్తు సమయంలో ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వరరావు స్పృహ తప్పి పడిపోవటంతో వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. మృతదేహం తరలింపులో నిందితుడి తల్లి ప్రమేయం లేదని, ఆ సమయంలో ఆమె విశాఖపట్నంలో ఉన్నట్లు ఫోన్‌ కాల్స్‌ ఆధారాలు లభించాయని చెప్పారు.

Got angry when Nagaraju touched him inappropriately: Sukru

కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ ధారావత్ వెంకటేశ్వరరావు భార్య అనిత న్యాయవాది. కొన్నేళ్ల కిందటే భార్యభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయినా, ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు వెంకట్‌ సుక్రుత్ (19) నగరంలోని ఓ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

అనిత వద్ద భూక్యా నాగరాజు ఆరేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దాంతో సుక్రుత్, డ్రైవర్‌ సన్నిహితంగా మెలిగేవారు. సాయి కల్యాణ్‌ రెసిడెన్సీ వాచ్‌మన్‌తో నాగరాజుకు స్నేహం ఉండటంతో సుక్రుత్, నాగరాజులు తరచూ ఆ అపార్ట్‌మెంట్‌ టెర్ర్‌సపై మద్యం సేవించేవారు. ఈనెల 17వ తేదీ రాత్రి కూడా ఇద్దరూ కలిసి టెర్ర్‌సపై మందుకొట్టారు. కిక్‌ తలకెక్కగానే సుక్రుత్ పట్ల నాగరాజు లైంగిక క్రీడ కోసం ప్రయత్నించాడు.

తనతో స్వలింగ సంపర్కం చేసేందుకు బలవతం చేశాడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న ఇటుక రాయితో నాగరాజు తలపై కొట్టాడు. అతడు అపస్మారక స్థితిలో పడిపోవటంతో సుక్రుత కిందకు వచ్చాడు. ద్విచక్ర వాహనం తాళం చెవులు మరచిపోవటంతో మరోసారి పైకి వెళ్లాడు. నాగరాజు మరణించినట్లు నిర్ధారించుకున్నాడు. అక్కడ నుంచి మధురా నగర్‌లోని తల్లి ఇంటికి చేరాడు. స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు.
నాగరాజు మరణించాడా! లేడా అని నిర్ధారించుకునేందుకు మర్నాడు మధ్యాహ్నం మళ్లీ టెర్రస్‌ మీదకు వెళ్లాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని కిందకు వచ్చాడు. లిఫ్ట్‌ వద్దకు రాగానే నాగరాజు వద్ద సెల్‌ఫోన్‌ ఉన్నట్లు గుర్తుకు రావటంతో మళ్లీ పైకి వెళ్లాడు. మృతుడి మొబైల్‌ ఫోన్‌ తీసుకుని దాన్ని ఖాళీ స్థలంలో పారేశాడు. హత్య విషయాన్ని తండ్రి వెంకటేశ్వరరావుకు ఫోన్‌చేసి చెప్పాడు.

మృతదేహం మాయం చేద్దామనుకుని..

హత్య గురించి కొడుకు చెప్పగానే మొదట తటపటాయించిన తండ్రి ఆ తర్వాత పథక రచన చేశాడు. 18వ తేదీ రాత్రి 11 గంటలకు సుక్రుత్, చిన్న కుమారుడు శశాంక్‌, అతడి స్నేహితుడు శ్యామ్‌లతో కలిసి తన భార్య కారు తీసుకుని వెంకటేశ్వరరావు అపార్టుమెంట్‌ వద్దకు వచ్చాడు. కారును దూరంగా నిలిపారు. టెర్ర్‌సపై ఉన్న మృతదేహాన్ని తీసుకు వచ్చేందుకు సుక్రుత్ అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లాడు.

Got angry when Nagaraju touched him inappropriately: Sukru

మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కిందకు దింపేందుకు ప్రయత్నించాడు. అలికిడి కావటంతో ఫ్లాట్‌ నంబరు 502 యజమాని జానకిరాం బయటకు వచ్చాడు. సుక్రుత్‌ను ప్రశ్నించాడు. పొంతన లేని సమాధానాలు చెప్పటంతో దొంగా.. దొంగా అంటూ అరిచాడు. దీంతో మృతదేహాన్ని మెట్ల మీదే వదిలేసి సుక్రుత్ పారిపోయాడు.

దాంతో ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు, చిన్న కుమారుడు, మరో వ్యక్తి కారు తీసుకుని పరారయ్యారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు హత్యకు గురైన వ్యక్తిని నాగరాజుగా గుర్తించారు. అతడి భార్య జమునను పిలిపించారు. సీసీ ఫుటేజ్‌లోని దృశ్యాలను చూపారు. నాగరాజుతోపాటు ఉన్న యువకుడు సుక్రుత్‌గా ఆమె నిర్ధారించింది.

తన కొడుకును తప్పించేందుకు డ్రైవర్‌ మిస్సింగ్‌ అంటూ ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు హైడ్రామా నడిపేందుకు ప్రయత్నించారు. కానీ, పోలీసులు సీసీ ఫుటేజీ చూపించడంతో సుక్రుత్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించాడు. అనంతరం, హత్యకు దారితీసిన పరిస్థితులను సుక్రుత్ పోలీసులకు వివరించినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

English summary
According to the police, Sukruth and the victim Nagaraj were close and used to drink together and were in a homosexual relationship. But during questioning, Sukruth claimed that he was irritated when Nagaraj made sexual advances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X