రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ విందు, మొబైల్ యాప్ ఆవిష్కరణ కూడా...

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆదివారం విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రాత్రి 7.30 గంటలకు విందు ఉంటుందని పేర్కొన్నాయి. విందులో రాష్ట్రపతి దంపతులు, గవర్నర్ దంపతులతోపాటు మంత్రులు, నేతలు, అధికారులు పాల్గొంటారు. సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం సతీసమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన ఉంటారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఆదివారం విందు ఇస్తున్నారు. ప్రతీ ఏటా శీతకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌ వస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా విచ్చేశారు. దాదాపు 10 రోజులు హైదరాబాద్‌లో బసచేసి.. తర్వాత ఢిల్లీ తిరిగి వెళ్లిపోతారు.

governer offer dinner for president of india

ఆదివారం నాటి విందు తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైట్ మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారులు కూడా ధ్రువీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+