పాతబస్తీ ఘటనలపై గవర్నర్ సీరియస్: కలిసిన సిపి మహేందర్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాదు పాతబస్తీలో గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన దాడులపై గవర్నర్ నరసింహన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 1.30గంటలకు తనను కలవాలని తెలంగాణ డిజిపి అనురాగ శర్మను, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలిసి పాతబస్తీ ఘటనలపై వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ నేతలపై దాడి ఘటనపై ప్రతిపక్షాల నాయకులు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నరు పోలీసు ఉన్నతాధికారులను పిలిచారని సమాచారం. హైదరాబాద్‌లో శాంతిభద్రతల బాధ్యత గవర్నర్‌దేనని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు.

ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో దాడుల ఘటనలపై పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. మజ్లీస్ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలపై కేసు నమోదు చేశారు. మజ్లీస్ శాసనసభ్యుడు బలాలాను బుధవారంనాడు అరెస్టు చేశారు. ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
కాంగ్రెసు నాయకులపై దాడులు చేశారనే ఆరోపణపై పోలీసులు బుధవారం సాయంత్రం ముగ్గురిని అరెస్టు చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లపై హత్యాప్రయత్నం కింద కేసులు నమోదు చేయించాలని ప్రతిపక్షాల నేతలు గవర్నర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications