వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రాద్రికి రోడ్డుమార్గంలో గవర్నర్ తమిళిసై: హెలికాఫ్టర్ సౌకర్యం కల్పించకుండా కెసీఆర్ సర్కార్ వివక్ష!!

|
Google Oneindia TeluguNews

గవర్నర్ తమిళ సైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం మరింత పెరుగుతోంది. ఇటీవల గవర్నర్ వ్యాఖ్యలు, ఆపై కేటీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతల ప్రతి దాడితో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తనను అవమానిస్తున్నారని, రాజ్ భవన్ కు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ పదేపదే చెబుతున్నా టిఆర్ఎస్ పార్టీ మాత్రం గవర్నర్ ఊహించుకుని మాట్లాడుతున్నారని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది. తాము గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తున్నామని టిఆర్ఎస్ నేతలు, మంత్రులు చెబుతున్నారు.

భద్రాద్రికి రోడ్డు మార్గంలో వెళ్ళిన తమిళి సై..

భద్రాద్రికి రోడ్డు మార్గంలో వెళ్ళిన తమిళి సై..


ఇక ఈ క్రమంలో తాజాగా శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా భద్రాద్రి శ్రీ రాముల వారి ఆలయానికి వెళ్తున్న గవర్నర్ కు హెలికాప్టర్ ఏర్పాటు చేయకపోవడంతో ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సోమవారం నాడు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారాముల పట్టాభిషేకం వేడుకలలో పాల్గొంటున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం తెల్లవారుజామున సికింద్రాబాద్ నుండి కొత్తగూడెం వరకు రైలు మార్గంలో ప్రయాణం చేసి, ఆపై రోడ్డు మార్గంలో భద్రాద్రికి వెళ్లారు.

మేడారం జాతరకు రోడ్డు మార్గంలోనే.. అవమానిస్తున్నారని గవర్నర్ అసహనం

మేడారం జాతరకు రోడ్డు మార్గంలోనే.. అవమానిస్తున్నారని గవర్నర్ అసహనం


కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో గవర్నర్ కు అడిషనల్ కలెక్టరేట్ వెంకటేశ్వర్లు స్వాగతం పలకగా, అక్కడి నుండి రోడ్డు మార్గంలో తమిళిసై భద్రాద్రికి చేరుకొని శ్రీ రాములవారి పట్టాభిషేకంలో పాల్గొంటున్నారు. గతంలో మేడారం జాతరకు వెళ్లిన సమయంలో కూడా గవర్నర్ తమిళిసై హెలికాఫ్టర్ అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఢిల్లీలో ఆమె మీడియా ముఖంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక భద్రాచలానికి కూడా రోడ్డు మార్గంలో వెళ్తానని తమిళిసై చెప్పినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆమెకు హెలికాప్టర్ సౌకర్యం కల్పించలేదు.

గవర్నర్ నరసింహన్ ఎప్పుడు భద్రాద్రికి వెళ్ళినా హెలికాఫ్టర్ సౌకర్యం

గవర్నర్ నరసింహన్ ఎప్పుడు భద్రాద్రికి వెళ్ళినా హెలికాఫ్టర్ సౌకర్యం

గవర్నర్ మీద ఎలాంటి వివక్ష లేదని చెప్తున్న తెలంగాణా ప్రభుత్వం గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన భద్రాచలానికి ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సౌకర్యం కల్పించి, ఆయనకు రాచమర్యాదలు చేసింది. అయితే గవర్నర్ తమిళిసై విషయంలో కెసిఆర్ ప్రభుత్వం ఆమెకు హెలికాప్టర్ సౌకర్యం కల్పించకపోవడం, ఆమె పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న వివక్ష అని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

కెసీఆర్ సర్కార్ తీరుపై మండిపడుతున్న బీజేపీ నాయకులు

కెసీఆర్ సర్కార్ తీరుపై మండిపడుతున్న బీజేపీ నాయకులు

రాష్ట్ర గవర్నర్ తమిళిసై విషయంలో కెసిఆర్ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సినిమాలో పనిచేసిన ఒక మహిళ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు పలుమార్లు వెళ్ళినప్పుడు హెలికాఫ్టర్ ద్వారా వెళ్లడాన్ని బీజేపీ శ్రేణులు గుర్తుచేస్తున్నారు. కావాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కావాలనే అవమానిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూస్తున్నారని మండిపడుతున్నారు. ఒక మహిళ గవర్నర్ ను ఇంతగా అవమానించడం సమంజసం కాదని బిజెపి నాయకులు కేసీఆర్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Governor Tamilisai is going to Bhadradri by road. She will participate in Shri Rama coronation today. Criticisms abounded that the KCR government was discriminating against the governor by not providing helicopter facilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X