ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ పరామర్శించారు.. మధ్యహ్నాం మూడున్నర గంటలకు గవర్నర్ ప్రియాంక ఇంటికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంఘటన కావడంతో గవర్నర్ సైతం సంఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగిన తర్వాత స్యయంగా గవర్నరే బాధిత కుటుంబాన్ని పరామర్శించడం ఇదే మొదటి సారి... ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించి, సంఘీబావాన్ని వ్యక్తం చేసిన గవర్నర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించడంతో నేతల దారులన్ని శాంషాబాద్‌లోని ప్రియాంక ఇంటికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రహొంమంత్రి కిషన్ రెడ్డి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా పలువురు స్థానికులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితులను వెంటనే ఉరి తీయాలని..మహిళలకు సరైన రక్షణ కల్పించాలని కోరారు. అయితే కిషన్ రెడ్డి వారిరి సముదాయించారు. 2018లోనే కేంద్రం కఠిన చట్టాలను తీసుకువచ్చారని , మహిళల రక్షణ కొసం ఆప్‌ను రూపోందించామని దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.

GovernorTamilsai visits Priyanka Reddys family

ప్రియాంక ఇంటికి క్యూ కడుతున్న నేతలు
ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రియాంకపై జరిగిన దాడిని రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. నిందితునికి కఠిన శిక్ష పడేవిధంగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. పలువురు మంత్రులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడ కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేరుగా హోంమంత్రి మహమూద్ ఆలీతో పాటు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి, బట్టి విక్రమార్కతోపాటు ఇతర కాంగ్రెస్ , బీజేపీ, టీడీపీలకు చెందిన నేతలు ప్రియాంక ఇంటికి తరలి వెళ్లిన వారిలో ఉన్నారు..

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+