ఉచిత బస్సు అమలులో కీలక మార్పు- ఇక నుంచి..!!
ఉచిత బస్సు ప్రయాణం అమలులో కీలక అప్డేట్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు పథకం కు ఆదరణ పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నాయి. సంక్రాంతి వేళ రెండు రాష్ట్రాల ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ అదనపు ఛార్జీల వసూలుకు నిర్ణయించింది. ఇక.. ఉచిత బస్సు మహిళలకే అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం అమలు ను నిరంతరం సమీక్షిస్తోంది. ఎక్కడా పథకం నిర్వహణలో సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా.. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇక.. ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలు ఆధారం చూపించే అవసరం లేకుండా.. స్మార్ట్ కార్డును తెలంగాణ ఆర్టీసీ అందుబాటు లోకి తీసుకొస్తోంది. ఇక.. ఉచిత బస్సు పథకం అమలులో ఎదురువుతున్న సమస్యల పైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వంతో చర్చించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకాన్ని మహిళలకే పరిమితం చేయకుండా విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం కొనసాగించేందుకు కసరత్తు చేస్తోంది.

ఏపీ ప్రభుత్వం తాజాగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాయితీ విధానంలో దివ్యాంగులకు బస్ పాస్ లు అందిస్తున్నారు. కాగా, ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విధంగా మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ చర్చలు చేస్తున్నారు. త్వరలో దివ్యాంగులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు జరిపానని, త్వరలోనే సీఎం రేవంత్‌తో మాట్లాడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తప్పకుండా దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అడ్లూరి లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎంత మంది దివ్యాంగులు ఆర్టీసీ కల్పించిన రాయితీ విధానం వినియోగించుకుంటున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది దివ్యాంగులు ఉన్నారు.. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో ఆర్దికంగా ఎంత భారం పడుతుందనే లెక్కలు సిద్దం చేస్తున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications