మద్యం ధరలు పెంపు - ఏ బ్రాండ్ ఎంత..!?
మద్యం ధరలు భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచనున్నట్టు సమాచారం. చీప్ లిక్కర్ మొదలుకొని మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద ధరలు పెంచటానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
ధరల పెంపు
ఏపీలో రూ 99కే మద్యం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోనూ ఇదే తరహాలో మద్యం కోసం పరిశీలన జరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో సైతం రూ 99 కే లిక్కర్ అమ్మకాలు జరుగుతు న్నాయి. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా మద్యం అమ్మకాల పైన ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి, విక్రయాలు, ఎన్డీపీఎల్ కేసులు కూడా తగ్గుతాయని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. తాజాగా మద్యం ధరల పెంపు పైన ప్రభుత్వా నికి ప్రతిపాదనలు అందాయి. అన్ని రకాల బ్రాండ్ల ధరలు పెంచేలా అంచనాలు సిద్దం చేసారు. ఈ పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అధికారుల ప్రతిపాదనలు
మద్యం ధరల పైన కసరత్తు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవచ్చని నివేదిక రూపొందించినట్టు సమాచారం. ఇక, ఏపీలో అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ...బ్రాండెడ్ మద్యం ధరలతో సరిహద్దు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్లు అధికారులు నివేదించారు. సరిహద్దులో ఉన్న ఒక్కో మద్యం దుకాణంలో ఏపీ ప్రజల కారణంగా నిత్యం రూ. 1.50లక్ష నుంచి రూ.2లక్షల వరకు విక్రయాలు జరిగేవి. దుకాణాలకు ఇచ్చిన లక్ష్యం లోపు వైన్స్ దుకాణాలు విక్రయాలు చేస్తే ప్రభుత్వానికి ఆయా విక్రయాల్లో 50శాతం, లక్ష్యానికి మించి విక్రయా లు చేస్తే 70శాతం ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఏపీలో మారిన నిర్ణయాలతో ఆదాయానికి గండి పడింది. దీంతో, సరిహద్దు మద్యం దుకాణాల్లో విక్రయాలు పడిపోయాయి.

పెరుగుదల ఎంత
దీని ద్వారా రాష్ట్ర మద్యం ఆదాయం దాదాపు రూ 1000 కోట్ల మేర తగ్గినట్లు చెబుతున్నారు. ఇక, తెలంగాణ కంటే ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో రాయల్ చాలెంజ్ క్వార్టర్ రూ.210, ఫుల్ బాటిల్ రూ.840 ఉంటే, ఏపీలో క్వార్టర్ రూ.230, ఫుల్ బాటిల్ రూ.920గా ఉంది. క్వార్టర్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80 అదనపు ధర ఉంది. త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. క్వార్టర్‌పై రూ.20, బీరుపై రూ.10 ధర పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏ బ్రాండ్ మద్యం ధర ఏ మేర పెంచాలనే అంశం పైన వివరాలు సమర్పించారు. ఈ ధరల విషయంలో ప్రభుత్వం ఏ మేర పెంచేందుకు అనుమతి ఇస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications