హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు - దేశంలోనే టాప్..!!
హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే తొలి నగరంగా ఖ్యాతి గడించింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ ఇప్పుడు ఈ గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం 150 వార్డులుగా ఉన్న హైదరాబాద్ 300 వార్డులకు పెరిగింది. అదే విధంగా కొత్తగా మరో 30 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు గ్రేటర్ పరిధిలోకి తెచ్చారు. పరిపాలనా సౌలభ్యం తీసుకున్న ఈ నిర్ణయం రానున్న గ్రేటర్ ఎన్నికల పైన ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. గ్రేటర్ లో వార్డుల సంఖ్య ఒకే సారి రెట్టింపు చేస్తూ తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపలా లిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది.

ఈ అరుదైన గుర్తింపు హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజి గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రతి 45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసారు.
అదే విధంగా కొత్తగా ప్రతీ జోన్ పరిధిలో అయిదు సర్కిల్ కార్యాలయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు, రాజకీయ పార్టీల నుండి సుమారు 6,000కు పైగా అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించిన అధికారులు 40 వార్డులకు పాత పేర్లనే కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు 2026 ఫిబ్రవరి 10తో ముగియనుంది.
ఈ లోపే వార్డుల పునర్విభజన , ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఇప్పుడు ఈ కార్పోరేషన్ ను మూడుగా విభజించాలనే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. రాజకీయంగా కలిసి వచ్చే నిర్ణయాల పైన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఒక్కటిగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అధికార పార్టీ నేతల సమాచారం. దీంతో.. తుది నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications