గ్రీన్ ఇండియా ఛాలెంజ్ .. మొక్కలు నాటిన అమితాబ్, నాగార్జున .. హర్షం వ్యక్తం చేసిన సంతోష్
వృక్షో రక్షతి రక్షితః అంటారు. అటువంటి వృక్షాలను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడతాయి. మన భావి తరాలను కాపాడతాయి. అంతేకాదు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాకుండా, మానవ మనుగడ ప్రమాదంలో పడకుండా ఉంటుంది. భావితరాలకు బంగారు భవిష్యత్తును కానుకగా ఇచ్చినట్టు ఉంటుంది. ఇక ఇదే నినాదంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.

దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్
తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా మొక్కలు పెంచాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొక్కలు పెంచాలన్న నినాదంతో జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ ఉద్యమం విస్తృత ప్రచారాన్ని పొందడమే కాకుండా అందరినీ మొక్కలు నాటేలా చేస్తుంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటిన అమితాబ్ ... ఎంపీ సంతోష్ కు ప్రశంస
తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మొక్కలు నాటారు. రామోజీ ఫిలిం సిటీ లో కార్యక్రమంలో పాల్గొన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించారు. రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటి తాను భాగాస్వామినని చెప్పారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అమితాబ్ తో పాటు మొక్క్కలు నాటిన నాగార్జున , అశ్వనీదత్
ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ 16 కోట్ల మొక్కలు నాటించారని కొనియాడిన అమితాబ్ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటుగా ఎంపీ సంతోష్ కుమార్ హీరో నాగార్జున నిర్మాత అశ్వినీ దత్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున సైతం పిలుపునిచ్చారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్న వారికి కృతఙ్ఞతలు చెప్తున్న సంతోష్
దీంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో మైలు రాయిని సాధించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో వివిధ రంగాల ప్రముఖులు పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడమే కాకుండా, తన అభిమానులకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. బిగ్ బీ అమితాబచ్చన్ వంటి ప్రముఖులు కూడా ఛాలెంజ్ కు మద్దతు పలకడంతో జాతీయస్థాయిలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేపట్టిన ప్రయత్నానికి గుర్తింపు వచ్చినట్లయింది. తన సంకల్పాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంపీ సంతోష్ కృతజ్ఞతలు చెప్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications