వధువు నచ్చక పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఆత్మహత్య
నిజామాబాద్: మరికొన్ని గంటల్లో పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లోతజ విషాదం అలుముకుంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్‌కు చెందిన షేక్ హమీద్(24)కు నవీపేట్ మండలం బినోలకు చెందిన యువతితో గురువారం పెండ్లి నిశ్చయించారు.
యువతిని చూసినప్పుడే హమీద్ కుటుంబసభ్యులు నచ్చలేదని చెప్పారు. హమీద్‌కు నచ్చటంతో పెండ్లి వరకు వచ్చింది. పెండ్లి నిశ్చయమైనప్పటి నుంచి కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలతో హమీద్ మనస్తాపానికి గురయ్యాడు. పెండ్లి తర్వాత ఇవే పరిస్థితులు ఎదురవుతాయని భావించి గురువారం పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరి కొద్దిగంటల్లో వధువు ఇంటికి వెళ్లాల్సి ఉండగా హమీద్ కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. గ్రామశివారులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హమీద్‌ను దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications