• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్ళయి 15రోజులైనా కాకముందే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి; విషాదంలో వధువు!!

|
Google Oneindia TeluguNews

కొత్తగా పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో జీవితాన్ని కొనసాగించాలి అనుకున్న వధువు రోడ్డు ప్రమాదంలో వరుడు మరణించడంతో తీరని దుఃఖం అనుభవిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లండన్ లో నివాసముంటున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయి 15రోజులు కూడా కాకముందే రోడ్డు ప్రమాదం రూపంలో వరుడు తిరిగిరాని లోకాలకు చేరుకోవడం రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది.

లండన్ లో ప్రేమ... విజయవాడలో పెళ్లి

లండన్ లో ప్రేమ... విజయవాడలో పెళ్లి


వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన అడపా రాజేందర్ కుమారుడు 29 సంవత్సరాల పృద్వి, ఏపీ లోని విజయవాడకు చెందిన భార్గవి లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా పని చేస్తున్నారు. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు గత నెల అక్కడి నుండి స్వస్థలాలకు వచ్చి, పెద్దల అనుమతితో మే 29వ తేదీన విజయవాడలో వివాహం చేసుకున్నారు. శనివారం లండన్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో, భార్య భార్గవిని విజయవాడలో ఉంచి లండన్ వెళ్లడానికి తమ ప్రయాణానికి అవసరమయ్యేవి కొనేందుకు పృథ్వి 8వ తేదీన కోదాడకు వచ్చాడు.

వరుడు, తండ్రితో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ..

వరుడు, తండ్రితో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ..

అయితే పృథ్వికి హాలియా కు చెందిన ఒక స్నేహితుడు రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నందున ఆ డబ్బులు తీసుకోవడం కోసం తండ్రి రాజేంద్ర తో కలిసి హాలియా కు బయల్దేరాడు పృథ్వి. అయితే కోదాడ నుంచి హాలియా కు మిర్యాలగూడ మీదుగా వెళ్లాల్సి ఉండగా, గూగుల్ మ్యాప్ లో నకిరేకల్ మీదుగా సూచించింది. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరూ నకిరేకల్ మీదుగా వెళ్తున్న క్రమంలో నకిరేకల్ మండలం, గోరింకల పల్లి సమీపంలోకి రాగానే ఏపీ పల్నాడు జిల్లా నరసరావుపేట నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న పృథ్వి కి తీవ్ర గాయాలయ్యాయి.

ఆస్పత్రికి తరలించే లోపే వరుడు మృతి.. విషాదంలో ఇరు కుటుంబాలు

ఆస్పత్రికి తరలించే లోపే వరుడు మృతి.. విషాదంలో ఇరు కుటుంబాలు

108లో ఆస్పత్రికి తరలించే లోపే పృథ్వి మృతిచెందాడు. ఇక రాజేందర్ కు గాయాలైనట్లు తెలుస్తుంది. పెళ్లయి పట్టుమని పదిహేను రోజులైనా కాకముందే ప్రేమించి పెళ్లాడిన భర్త దుర్మరణం పాలు కావడంతో ఆ యువతి కన్నీరుమున్నీరవుతుంది. పెళ్లి చేసుకుని సుఖంగా జీవితం సాగిస్తాడు అనుకున్న కొడుకు కళ్ళ ముందు దుర్మరణం పాలు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఇక తమ కుమార్తె జీవితం పెళ్లి చేసుకున్న భర్త తో సంతోషంగా ఉంటుందని భావించిన వధువు తల్లిదండ్రులు అల్లుడు మృతిచెందిన షాక్ నుండి ఇంకా కోలుకోలేదు.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
 కొత్తగా పెళ్లి చేసుకున్న వారి పాలిట మరణ శాసనాలు రాస్తున్న రోడ్డు ప్రమాదాలు

కొత్తగా పెళ్లి చేసుకున్న వారి పాలిట మరణ శాసనాలు రాస్తున్న రోడ్డు ప్రమాదాలు


రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, వాహనాలు నడిపే వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉండాలని సూచించినప్పటికీ, నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో పెళ్లి చేసుకునే వధువు, వరుడు వివిధ కారణాలతో మృతి చెందుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు కొత్తగా పెళ్లి చేసుకున్న వారి పాలిట మరణ శాసనాలు రాస్తున్నాయి.

English summary
A couple of software employees, who came from London and got married in Vijayawada, had an unexpected tragedy while traveling back to London. The incident took place when the groom was killed in a road accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X