గుర్రం బాబా అరెస్టయ్యాడు: రూ.57 లక్షల కోయదొరలు దొరికారు
మహబూబాబాద్ జిల్లా కురవి మండ శివారు లింగ్యాతండాకు గిరిజనుల అమాయకత్వాన్ని, వారి మూఢనమ్మకాలను అసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకున్న గుర్రంబాబాను బుధవారం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాహేమ
మహబూబాబాద్/ వరంగల్: మహబూబాబాద్ జిల్లా కురవి మండ శివారు లింగ్యాతండాకు గిరిజనుల అమాయకత్వాన్ని, వారి మూఢనమ్మకాలను అసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకున్న గుర్రంబాబాను బుధవారం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాహేమంద్రనాయక్ తెలిపారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గుర్రం బాబా అరెస్టు చూపి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండం ఎన్ అన్నారం గ్రామానికి చెందిన పర్వతం రామచంద్రస్వామి గుర్రం బాబాగా అవతారమెత్తి 40 రోజు క్రితం కురవి శివారు లింగ్యాతండాలో బొడ్రాయిని ప్రతిష్టిస్తానని కొంత మంది దగ్గర వేలాది రూపాయలు వసూలు చేశాడు. తండాకు కీడు పట్టుకుందని, అది పోగొట్టేందుకు కొంత ఖర్చు అవుతుందని తండా గిరిజన పెద్దతో నమ్మబలికాడు. దీంతో వారు మేకలు, గొర్రెలు, కోళ్లు సుమారు రూ. 5 క్ష నగదును ముట్టజెప్పారు.

కొంతకాం కన్పించకుండా పోయిన గుర్రం బాబా ఎంతకి తిరిగి రాకపోవడంతో అతడిపై కురవి పోలీస్‌స్టేషన్‌లో ఇటీవలనే గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీసులు చాకచక్యంగా గుర్రం బాబా స్వగ్రామం ఎన్. అన్నారంలోని ఇంటికి వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసు మాటువేసి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి బాబాలను నమ్మి మోసపోవద్దని, వారు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాని డీఎస్పీ రాజమహేంద్రనాయక్ సూచించారు.
మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
కొయదొరల పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసి రూ.57లక్షలు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గందసిర గ్రామానికి చెందిన పస్తం నరసింహారాజు అలియాస్ లక్ష్మణ్‌రాజు, పస్తం రాజు అలియాస్ వంశీ ఇద్దరు వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట వద్ద నివాసం ఉంటూ నగరంలో పలు ప్రాంతాలు తిరుగుతూ జోతిష్యం చెబుతుంటారు.
ఈ క్రమంలో ఆరు నెలల కిందట నక్కలగుట్టకు చెందిన మానసరెడ్డి అనే మహిళను కోయదొరలమని పరిచయం చేసుకొని పూజలు చేస్తామని చెప్పి నమ్మించారు. దీంతో ఆమె వారి మాయమాటలు నమ్మి పూజలు చేసేందుకు నక్కలగుట్ట జిల్లాపరిషత్ వద్ద తొలివిడతగా లక్ష రూపాయలు ఇచ్చారు. తరువాత పలుమార్లు మానసరెడ్డి వద్దకు వచ్చి పూజలు చేస్తే మంచి జరుగుతుందని, అనుకున్న పనులు పూర్తవుతాయంటూ నమ్మబలికి దశలవారీగా రూ.57లక్షలు వసూలు చేశారు.
ఇందులో నరసింహారాజు రూ.29.50లక్షలు, రాజు రూ.26.50లక్షలు పంచుకున్నారు. ఆ డబ్బుతో ఒకరు స్వగ్రామంలో భూమి, మరొకరు ఖమ్మం నగరంలో ఇళ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తిరిగి ఈనెల 14తేదీన మరికొన్ని డబ్బులు కావాలని ఇద్దరు మానసరెడ్డికి ఫోన్ చేశారు. అనుమానం వచ్చిన ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న తన మామయ్య బాల్‌రెడ్డికి విషయం చెప్పింది.
మోసపోయామని గమనించిన బాల్‌రెడ్డి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం హంటర్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వెళ్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా చేసిన మోసాన్ని అంగీకరించారు. వెంటనే వరంగల్‌లోని వారి నివాసానికి వెళ్లి రూ.57లక్షల నగదును స్వాధీనం చేసుకొని నిందితుల ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications