మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీకటి ఒప్పందం, పక్క రాష్ట్రం బాబు చెబితే: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం ఆరోపించారు. ఆ రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మెదక్ లోకసభ ఎన్నికల్లో తెరాస ప్రభంజనాన్ని తట్టుకోలేక ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు తమదే అన్నారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపు పైన టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు సవాల్ విసిరితే తాను స్వీకరించానని చెప్పారు.

Harish Rao alleges mutual cooperation between Congress and BJP

టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీకి మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం, మాట మార్చటం వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

బీజేపీ-టీడీపీ అభ్యర్థి జగ్గారెడ్డి సమైక్యవాది అన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ నిర్ణయించిందా లేక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారా ప్రజలకు చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలంగాణ ఉధ్యమం సమయంలో రాజీనామా చేయకుండా ఈ ప్రాంత ప్రజలను మోసగించారన్నారు. పేరుకే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని, ఆన బీజేపీ కేంద్రమంత్రి వెంకయ్య, చంద్రబాబు కనుసన్నుల్లో పని చేస్తున్నారన్నారు.

English summary
Harish Rao alleges mutual cooperation between Congress and BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X