దైవసాక్షిగా ఇదీ జరిగిందీ - కాళేశ్వరం విచారణలో హరీష్ కీలక సమాచారం..!!
కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమా ధానం ఇచ్చారు. తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందో సుదీర్ణ వివరణతో సమాధానం చెప్పారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో నీటీ సమస్య పరిష్కారానికి వీలుగా ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తో నిర్ణయాలు తీసు కుందని కమిషన్ కు హరీష్ వివరించారు.
కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ కీలక అంశాలు వెల్లడించారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలో మహారాష్ట్రలోనూ, తెలంగాణలోనూ, సెంట్రల్‌లో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. దాంతో తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్రానికి నీళ్లు రావాడం కోసం ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లే సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్‌పై నిర్ణయం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిషన్‌కు తెలిపారు.

కాగా, ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చిందని, అలాగే నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ కూడా నివేదిక ఇచ్చిందని, అలాగే ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిం దని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని మార్చి తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల ని... మూడు బ్యారేజీలు నిర్మించాలని టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పారు. మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు తో పాటుగా పలు అంశాల పైన కమిషన్ ప్రశ్నలు సంధించింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చా మని హరీష్ చెప్పినట్లు సమాచారం. 16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే... రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సీడబ్ల్యూసీ చెప్పినట్లు వివరించారు. సీడబ్ల్యుూసీ సూచనల మేరకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచామని చెప్పారు.
మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదని హరీష్ వెల్లడించారు. మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేక సార్లు భేటీ అయినట్లు వివరించారు. వ్యాప్కోస్ నివేదికల ఆధారం గా మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు నిర్మించామని చెప్పారు. మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా రిపోర్టులు ఇచ్చారని పేర్కొన్నారు. లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్,
టెక్నికల్ రిపోర్టులు ఆధారంగా మార్పు జరిగిందన్నారు. బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్స్ మారడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున సాగర్, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషన్‌లు మారాయని హరీష్ చెప్పినట్లు సమాచారం.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications