వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ క్యాంపులో కలవరం, తరలి వస్తున్న అభిమానులు: భారీగా మ‌ద్ద‌తు..

|
Google Oneindia TeluguNews

టిఆర్‌య‌స్ కీల‌క నేత హ‌రీష్ రావు క్యాంపు లో క‌ల‌వ‌రం మొద‌లైంది. టిఆర్‌య‌స్ కు ప్ర‌తీ క‌ష్ట స‌మ‌యంలో ట్ర‌బుల్ షూట‌ర్ గా ఉన్న హ‌రీష్ ను విస్మరిస్తున్నార‌నే భావ‌న ఆయ‌న అనుచ‌ర‌ల్లో మొద‌లైంది. కెటిఆర్ కు వ‌ర్కింగ్ ప్రెసిడెం ట్ క‌ట్ట‌బెట్ట‌టంతో ఇప్పుడు హ‌రీష్ అనుచ‌ర‌ల్లో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కెటిఆర్ విలువ పెంచుతూ..మ‌రో వైపు హ‌రీష్ కు ప్రాధాన్య‌త త‌గ్గిస్తున్నార‌నే ఆందోళ‌న వారిలో కనిపిస్తోంది. అయితే, హ‌రీష్ వారిని స‌ముదాయించి పంపి స్తున్నారు..ఇప్పుడు ఇది తెలంగాణ అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది..

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

పార్టీ ప్రారంభం నుండి

పార్టీ ప్రారంభం నుండి

తెలంగాణ ఉద్య‌మ కాలం నుండి కెసిఆర్ ను హ‌రీష్ వెన్ను ద‌న్నుగా నిలిచారు. ప్ర‌తీ సంద‌ర్భంలోనూ త‌న ప్ర‌త్యేక‌త ..త‌న అవ‌స‌రం ఏంటో నిరూపించుకున్నారు. పార్టీ ప్రారంభం నుండి ఉద్య‌మ స‌మ‌యంలోనూ కీల‌క పాత్ర పోషించా రు. అసెంబ్లీ లోప‌లా..బ‌యటా పార్టీకి ప్ర‌ధాన వాయిస్ గా వ్య‌వ‌హ‌రించారు. ఉప ఎన్నిక‌లొచ్చినా..తాజాగా జ‌రిగిన ఎన్నిక ల్లోనూ త‌న సామ‌ర్ద్యం ఏంటో రుజువు చేసుకున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం లో ప్ర‌చారం చేసుకోక‌పోయినా.. ల‌క్షా 20 వేల ఓట్ల పైగా మెజార్టీతో గెలుపొందారు.

రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)

కెసిఆర్ త‌న కుమారుడు కెటిఆర్

కెసిఆర్ త‌న కుమారుడు కెటిఆర్

కాంగ్రెస్ కీల‌క నేత‌లైన జానారెడ్డి, కోమ‌టిరెడ్డి, రాజ‌న‌ర్సింహ‌, రేవంత్ రెడ్డి, డికె అరుణ వంటి వారిని ఓడించ‌టం కోసం ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అభ్య‌ర్ధుల‌కు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఎప్పుడు టిఆర్‌య‌స్ ఇబ్బందుల్లో ఉన్నా..వాటిని ప‌రిష్క‌రించ‌టంలో ట్ర‌బుల్ షూట‌ర్ గా నిలుస్తారు. గ‌తంలోనే కెసిఆర్ త‌న కుమారుడు కెటిఆర్ కు ప్రాధాన్య‌త పెంచుతూ త‌మ నేత హ‌రీష్ కు విలువ త‌గ్గిస్తున్నార‌నే భావ‌న‌లో ఆయ‌న అనుచ‌రులు..అభిమానులు ఉండేవారు. హ‌రీష్ టిఆర్‌య‌స్ ను వీడి వెళ్తున్నార‌నే ప్ర‌చారం సైతం జ‌రిగింది. కానీ, వాట‌న్నింటినీ ప‌టా పంచ‌లు చేస్తూ హ‌రీష్ పార్టీలోనే కంటిన్యూ అయ్యారు.

హ‌రీష్ ను సంతృప్తి ప‌ర‌చ‌టానికే అన్న‌ట్లు గా

హ‌రీష్ ను సంతృప్తి ప‌ర‌చ‌టానికే అన్న‌ట్లు గా

ఇక‌, తాజాగా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కెటిఆర్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వ‌టంతో మరోసారి హ‌రీష్ కు ల‌భిస్తున్న ప్రాధాన్య‌త పై చ‌ర్చ మొద‌లైంది. రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కెటిఆర్ కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అప్ప‌గించి..నెంబ‌ర్ టు స్థానం అప్ప‌గించిన‌ట్లుగా పార్టీ కేడ‌ర్ భావిస్తోంది. అదే స‌మ‌యంలో హ‌రీష్ కు ఎటువంటి ప్రాధాన్య‌త ఇస్తార‌నే అంశం మాత్రం చ‌ర్చ‌కు రాలేదు. కానీ, హ‌రీష్ ను సంతృప్తి ప‌ర‌చ‌టానికే అన్న‌ట్లు గా త‌న‌కు ప‌ద‌వి ప్ర‌క‌టించిన వెంట‌నే కెటిఆర్ స్వ‌యంగా హ‌రీష్ ఇంటికి వెళ్లి..మద్ద‌తు కోరారు.

ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హ‌రీష్

ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హ‌రీష్

హ‌రీష్ సైతం కెటిఆర్ ను అభినందించి..త‌న స‌హ‌కారం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల‌ను హ‌రీష్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారంతా త‌మ నేత పై ఉన్న అభిమానంతో హ‌రీష్ వ‌ద్ద‌కు వ‌స్తున్నారు. హ‌రీష్ కు ఉద్దేశ పూర్వ‌కంగానే ప్రాధాన్య‌త త‌గ్గిస్తున్నార‌నే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హ‌రీష్ మాత్రం ఎక్క‌డా తొంద‌ర‌డి వ్యాఖ్య‌లు చేయ‌టం లేదు. ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న అనుచ‌రుల‌ను సైతం స‌ర్దిచెప్పి పంపిస్తున్నారు. మ‌రి , రానున్న రోజుల్లో హ‌రీష్ ప్రాధాన్య‌త ఏ స్థాయిలో ఉంటుంద‌నేది ఆస‌క్తి క‌ర‌మే..

English summary
Harish Rao camp in dailama. After anouncement of KTR as TRS working president Harish Followers asking about His position in party. They demanding that Harish priority should continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X