కాలుజారి కిందపడ్డ హరీష్‌రావు, గాయాలు: కారు వదిలి రైల్లో వచ్చారు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు.
అనంతరం ఆయన తిరిగి వస్తుండగా కాలు జారి పడ్డారు. ఆయన పట్టుతప్పి కింద పడ్డారు. దీంతో మంత్రి కాలుకు, నడుముకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. సత్తుపల్లి నుంచి వవచ్చిన వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు.
అనంతరం ఆయన రైలులో హైదరాబాదుకు చేరుకున్నారు. ఆయన బుధవారం నాడు ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. కాలు జారిన ఘటనలో హరీష్ రావు నడుము, కాలికి స్వల్ప గాయాలయ్యాయి.

ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన
గ్రామజ్యోతిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో పర్యటిస్తున్నారు. ఎర్రవల్లి గ్రామంలో సీఎం పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఎర్రవల్లి గ్రామసభలో సీఎం పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు.
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తాం: సుమన్
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించేందుకు కంకణం కట్టుకున్నామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ స్పష్టంచేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్‌పీ 3గని వద్ద కార్మికులతో మాట్లాడారు.
కార్మికుల సమస్యలు తనకు తెలుసునని, సమస్యలపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.
కార్మికులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మరచిపోరన్నారు. తప్పకుండా వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తారని, ఇది కేసీఆర్ మాటగా తాను చెబుతున్నానన్నారు. ఆదాయ పన్నురద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సకల జనుల సమ్మె వేతనాలు ఇప్పించడంలో జాప్యమవుతున్నదని, త్వరలో ఇప్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications