సీఎం రేవంత్ కు హరీష్ అనూహ్య డిమాండ్...!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అటు ఎన్నికల సంఘం.. ఇటు రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్, సింగరేణ్ గనుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ సమయంలో సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ అనూహ్య డిమాండ్ చేసారు.
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడని ఆరోపించారు. స్కాంలు, కాంగ్రెస్ అరాచకాలతో సింగరేణి సంస్థపై భారం పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో స్కీంలు లేవు.. కానీ స్కాంలు పెరిగిపోయాయని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ కాదని.. రేవంత్‌రెడ్డి స్కాంల క్యాలెండర్‌ను తెచ్చారని హరీష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రా నేతలతో రేవంత్‌రెడ్డి చేతులు కలిపి.. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో అత్యుత్తమ హోదా పొందటానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనేనని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. అంతటి అనుభవం ఉన్న భట్టి విక్రమార్క.. రేవంత్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం పనిచేయటం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణి స్కాంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలని హరీష్ డిమాండ్ చేశారు.

కాగా, డిప్యూటీ సీఎం భట్టి లబ్ధిదారుడా లేదా అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో మంత్రులు రాజీనామా చేసేవారని ప్రస్తావించారు. సింగరేణి ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. తనకు లేఖ రాస్తే.. ముఖ్యమంత్రితో మాట్లాడుతానని భట్టి అనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రేపో, మాపో తమకు మరో ప్రేమ లేఖ(సిట్ నోటీసు) వస్తుందని సెటైర్ వేసారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది బాగోతం బయటపడకుండా.. భట్టి రక్షిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతల స్వార్థం కోసం వారికి అనుకూలంగా సింగరేణి విధనాలను మార్చారని ఆక్షేపించారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉందని భట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఓబీ వర్క్స్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానమే లేదని స్పష్టం చేశారు. 2018 నుంచి 2024 వరకు అనేక ఓబీ వర్క్స్‌కు టెండర్లు జరిగాయని... వాటికి సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేదని ప్రస్తావించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ కోసం కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద బుక్‌ను బయట పెట్టాలని హరీష్ డిమాండ్ చేసారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications