ప్రతి దానికీ కొర్రీయే: కాంగ్రెసుపై దుమ్మెత్తిపోసిన హరీష్ రావు
హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసే పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏ పనిచేసినా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయికి చేర్చుతామంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వర్షం పడితేకూలేలా ఉస్మానియా ఆస్పత్రి భవనం ఉందని తెలిపారు. పెచ్చులూడితో రోగులు, వైద్యులకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని వివరించారు. అసలు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదా? అని నిలదీశారు. వాళ్లేమో పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటారని అన్నారు.

ఇంత పెద్ద హైదరాబాదు నగరంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే పెద్ద భవనం లేదని కళాభవనం కడదామని నిర్ణయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వాన్ని పనులు చేయనియ్యొద్దనే ఉద్దేశ్యంతో గుడ్డిగా అడ్డుకుంటున్నారని, అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. నిన్న గ్రామజ్యోతి పథకం కోసం 20 కిలోమీటర్ల దూరంలో రాజేంద్రనగర్‌లో వ్యవసాయ వర్సిటీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రైవేట్ కంపెనీల నుంచి పోటీని తట్టుకోలేక బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాల్లో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారంనాడు లోకసభలో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఒక మంచి ప్రభుత్వ రంగ సంస్థ అని దానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెంచవచ్చునని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications