వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాజెక్టులపై లేఖాస్త్రాలు: బాబు ప్రత్యేకహోదా సాధించలేకే: హరీష్ 10ప్రశ్నలు, ఏపీ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి ప్రాజెక్టుల కోసం లేఖల యుద్ధం జరిగింది. ఏపీలోని ప్రాజెక్టుల పైన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని ప్రాజెక్టుల పైన ఏపీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం నాడు లేఖాస్త్రాలు సంధించుకున్నారు.

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పది ప్రశ్నలతో కూడిన లేఖను ఏపీకి సంధించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కాదు అనేందుకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో కరవు ప్రాంతాలకు నీరు అందిస్తే మీకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.

పాలమూరు ఎత్తిపోతల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హామీ వచ్చిందని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు సర్వే చేసి జీవో ఇచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రధాని మోడీలు ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు.

Harish Rao ten questions to AP, AP government counter

బచావత్ తీర్పు ప్రకారం కృష్ణా నదిలో తెలంగాణకు 300 టిఎంసీల నీటి పైన హక్కు ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చెప్పిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అది తీసుకు రాలేక, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

పోతిరెడ్డిపాటు, హంద్రీనీవా, గాలేరు నగరి ఏ అనుమతులతో నిర్మించారో చెప్పాలన్నారు. ఏపీ సర్కారు లేఖతో మా ప్రాజెక్టులు ఆగవన్నారు.

ఏపీ ఇరిగేషన్ శాఖ కౌంటర్

ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ కౌంటర్ లేఖ రాసింది. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమని ఏపీ జలవనరుల శాఖ లేఖలో పేర్కొంది. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పాతవేనని చెప్పారు. సుప్రీం కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు.

రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలు, కవిత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం తెలిపారు.

సాయంత్రం తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు కవిత, ఇతర టిఆర్ఎస్ ఎంపీలతో కలిసి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. కమల్‌నాథన్‌ కమిటీలో
తెలంగాణకు జరుగుతున్న అన్నాయాన్ని హోంమంత్రికి చెప్పామన్నారు.

English summary
Telangana Minister Harish Rao has blamed AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X