పరిశోధక విద్యార్థి ఆత్మహత్య: అట్టుడుకుతున్న హెచ్‌సియు

హైదరాబాద్: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సస్పెన్షన్‌కు గురైన పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల చక్రవర్తి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు పట్టణానికి చెందిన రోహిత్ హెచసీయూలో సైన్స్ అండ్‌ టెక్నాలజీలో పీహెచడీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎనఆర్‌ఎస్ హాస్టల్‌ ఐ వింగ్‌లోని 207 గదిలో అతడు ఫ్యాన్‌కు తువాలుతో ఉరేసుకున్నాడు. విద్యార్థి మృతికి నిరసనగా హెచ్‌సియు విద్యార్థులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ విద్యార్థి ఉదయం నుంచి కనిపించకపోవడంతో తోటి విద్యార్థి విజయ్‌ రూమ్‌ నెం.207కి వెళ్లి తలుపు కొట్డాడు. ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా రోహిత మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన విజయ్‌.. అధికారులకు సమాచారం అందించాడు. సెక్యూరిటీ అధికారులు, గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. రోహిత తల్లిదండ్రులు రాధిక, మణికుమార్‌కు విద్యార్థులు సమాచారం అందించారు. రోహిత ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.

HCU research student commits suicide in Hyderabad

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించకుండా విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని కదలనీయబోమని భీష్మించారు. ఆదివారం రాత్రి వరకు కూడా విద్యార్థులు అలాగే ఉన్నారు. రోహిత్ ఆత్మహత్య గురించి తెలుసుకుని అక్కడికి వచ్చిన స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన ప్రకాష్ బాబు, చీఫ్‌ సెక్యూరిటీ అఫీసర్‌ టీవీ రావులపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి వరకూ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తూనే ఉన్నారు. విద్యార్థి ఆత్మహత్య తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని వర్సిటీ వీసీ అప్పారావు అన్నారు.

హెచ్‌సీయూలో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వామపక్ష విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎస్ఎఫ్ఐ తెలంగాణ కమిటీ తెలిపింది. ఈ మేరకు కమిటీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

వేముల రోహిత్ ఆత్మహత్యకు నైతిక బాధ్యత వర్సిటీ వీసీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వీసిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

దళిత విద్యార్థుల సస్పెన్షన్, విద్యార్థి ఆత్మహత్యపైన సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+