పెళ్లి చేసుకుంటానని అత్యాచారం: నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు
మహబూబ్‌నగర్: నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డిపై కేసు నమోదైంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పంజాగుట్ట పీఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పెళ్లి పేరిట తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన ఓ మహిళ నేత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

శివకుమార్‌రెడ్డి వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని.. ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.హోటల్‌కు పిలిపించి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ తెలిపింది. శివకుమార్ రెడ్డి తన భార్య మూడేళ్ల కంటే బతకదని చెప్పి తన మెడలో పసుపుతాడు కట్టాడని ఫిర్యాదు పేర్కొంది.
శివకుమార్ రెడ్డి తనకు పసుపుతాడు కట్టి తనను శారీరకంగా అనుభవించాడని వెల్లడించింది. ఇప్పుడేమో శివకుమార్‌రెడ్డి తన అనుచరులతో బెదిరిస్తున్నాడని మహిళ ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో శివకుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై అత్యాచార ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications