• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి ఎదురుగాలి..! పార్టీ వీడేందుకు రెఢీ అవుతున్న నేత‌లు..!!

|

హైద‌రాబాద్: అదికార టీఆర్ఎస్ పార్టీలో విచిత్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే తిరుగుబాటు దారుల‌తో ఉక్కిబిక్కిరి అవ‌తున్న గులాబీ పార్టీ తాజాగా నేతలు పార్టీ వీడేందుకు రెడీ అవుతుండ‌డంతో అయోమ‌యానికి గురౌతోంది. కొంత మంది ఎమ్మెల్యేల‌పైన వ‌స్తున్న సినీ తార‌ల వేదింపుల ఆరోప‌ణ‌లు కూడా ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించింది. ఇక పార్టీ లైన్ ను దిక్క‌రిస్తూ చాలా మంది ప్ర‌జాప్ర‌తినిదులు పార్టీకి త‌ల‌నొప్పిగా మారుతున్నారు. కొంత‌మందిని బుజ్జ‌గించేందుకు సాక్షాత్తూ ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు తో పాటు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగుతున్నా ప‌రిస్థితులు అదుపులోకి రావ‌డం లేదు.

గులాబీ పార్టీలో విప‌త్క‌ర పిరిస్థితులు..! అసంత్రుప్తితో ర‌గిలిపోతున్న నేత‌లు..!!

గులాబీ పార్టీలో విప‌త్క‌ర పిరిస్థితులు..! అసంత్రుప్తితో ర‌గిలిపోతున్న నేత‌లు..!!

తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీలో విప‌త్క‌ర పిరిస్థితులు నెల‌కొన్నాయి. పార్టీ నేత‌ల్లో ప‌ర‌స్ప‌ర విరుద్ద భావాలు చేటు చోటుచేసుకోవ‌డంతో పార్టీ చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితుల వ‌ర‌కు దారి తీసింది. మొత్తం ఆదిలాబాద్ జిల్లా గులాబీ నేత‌లు అసంత్రుప్తితో ర‌గిలిపోతున్న‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. పాత జిల్లాల ప్ర‌కారం ఆదిలాబాద్ జిల్లా రాజ‌కీయంగా టీఆర్ఎస్ పార్టీకి కీలంగా ఉన్న జిల్లా. దీంతో అదే జిల్లాలో పార్టీలో లుక‌లుక‌లు చోటుచేసుకోవ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.

ఎన్నికల వేళ ఆదిలాబాద్ టీఆర్ఎస్ కు షాక్..! పార్టీ మారుతున్న ఎమ్మెల్సీ..!!

ఎన్నికల వేళ ఆదిలాబాద్ టీఆర్ఎస్ కు షాక్..! పార్టీ మారుతున్న ఎమ్మెల్సీ..!!

ముందస్తు ఎన్నికల వేళ ఆదిలాబాద్ టీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ త‌గులుతోంది. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా అందరూ ఏకమవగా, అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ లో దుమారం రేగుతోంది. ఇదే జిల్లాలోనే కాదు, పలు చోట్ల అభ్యర్ధులు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా వారికి వ్యతిరేకత ఎదురవడం పార్టీకి శ‌రాఘాతంలా ప‌రిణ‌మించింది. ఇలాంటి అంత‌ర్గ‌త పోరును అదికార పార్టీ ఎలా అదిగ‌మిస్తుందో అన్న అంశం ఆస‌క్తి రేపుతంది.

కాంగ్రెస్ గూటీకి గులాబీ నేత‌లు..! నియంత్ర‌ణ కోల్పోతున్న పార్టీ..!!

కాంగ్రెస్ గూటీకి గులాబీ నేత‌లు..! నియంత్ర‌ణ కోల్పోతున్న పార్టీ..!!

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సొంత నియోజకరవర్గం నిర్మల్‌లో పార్టీ పెద్ద కుదుపుకు లోన‌యింది. ఆయన అనుచరుడు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు మంత్రికి ఎదురుతిరిగారు. టీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్, ఆయన మద్దతుదారులైన కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. మంత్రి తీరు నచ్చకపోవడంతో పార్టీ మారాలని వారు నిర్ణయించుకున్నారని, త్వరలో రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది.

అదికార పార్టీ అసంత్రుప్తి నేత‌ల‌కు కాంగ్రెస్ గాలం..! గులాబీ నైతిక స్థైర్యం పై ద‌బ్బ‌..!!

అదికార పార్టీ అసంత్రుప్తి నేత‌ల‌కు కాంగ్రెస్ గాలం..! గులాబీ నైతిక స్థైర్యం పై ద‌బ్బ‌..!!

అధికార పార్టీలోని అసంతృప్త నేతలను గాలం వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీని వల్ల ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చన్నది వీరి అంచనాగా తెలుస్తోంది. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ రాముల్‌ నాయక్‌ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి కుంతియాను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరుతున్నట్టు సమాచారం. టిక్కెట్ పై హామీ లభిస్తే ఆయన పార్టీ మారటం ఖాయంగా చెబుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో అదికార గులాబీ పార్టీకి ఎద‌దురీత త‌ప్పేలా కనిపించ‌డం లేదు.

English summary
There are strange developments in the TRS party. The pink party that has already been revolted by the rebels has been confused with the latest leaders being ready to leave the party. There are no conditions coming under the control of KTR, along with the Chief Minister Chandrashekhar Rao, who witnesses to appease some.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X