వణికిస్తున్న గుండెపోటు మరణాలు: స్నేహితులతో మద్యం తాగుతుండగా కుప్పకూలిన వ్యక్తి మృతి!!
పరీతంగా పెరిగిపోయిన సడన్ గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్నేహితులతో మద్యం తాగుతుండగా కుప్పకూలిన వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్: గుండెపోటు.. ఈ పేరు చెప్తే చాలు ప్రస్తుతం అందరూ వణికిపోతున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఉన్నచోటనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. తాజాగా స్నేహితులతో కలిసి సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ మరో వ్యక్తి కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్మిక నగర్ లో నివసించే మల్లె రామారావు అనే 35 సంవత్సరాల సెంట్రింగ్ వర్కర్ భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇక ఇటీవల పెద్దపల్లి లో ప్రార్థనకు భార్య, పిల్లలు వెళ్లగా ఇంట్లోనే ఉన్న అతను స్నేహితులతో కలిసి మద్యం షాప్ వద్దకు మద్యం తాగడానికి వెళ్ళాడు. మద్యం తాగుతూ మధ్యలోనే కుప్పకూలి పడిపోయాడు. దీంతో వెంటనే స్నేహితులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రామారావును పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందాడని నిర్ధారించారు.

అయితే మద్యం తాగే సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగిందని, ఘర్షణలో స్నేహితులు పిడి గుద్దులు గుద్దడం వల్లే రామారావు మృతి చెందాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వైన్స్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువకులు గొడవపడ్డ ఘటన చోటు చేసుకుందని కానీ రామారావు ఘర్షణకు చాలా దూరంగా ఉన్నాడని పేర్కొన్నారు. రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కూడా ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని కేవలం గుండెపోటు కారణంగానే రామారావు మృతి చెందాడని నిర్ధారించారు.
అయితే రామారావు మృతి పై అనుమానంతో మృతుడి భార్య ఫిర్యాదు ఇవ్వడంతో అనుమానాస్పతి మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వరుస గుండె పోటు మరణాల నేపధ్యంలో చాలా మంది గుండె ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications