హైదరాబాద్ లో ర్యాగింగ్ కలకలం.. అమాయక విద్యార్థి బలి..తండ్రికి సెల్ఫీ వీడియో..!

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ రోజుల్లో కూడా ర్యాగింగ్ నడుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ర్యాగింగ్ బూతానికి ఓ విద్యార్థి బలైన ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. సీనియర్లు వేధిస్తున్నారంటూ తండ్రికి సెల్ఫీ వీడియో పంపిన కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నగలకొండకు చెందిన సాయితేజ అనే విద్యార్థి హైదరాబాద్ మేడిపల్లిలోని సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కాలేజీలో సెండర్ ఇయర్ చదువుతున్నాడు. అయితే సెప్టెంబర్ 21న తన తండ్రికి వీడియో కాల్ చేసిన సాయితేజ.. కాలేజీలోని సీనియర్లు తనను ర్యాగింగ్ చేస్తున్నారని.. కొడుతున్నారని.. డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోతున్నట్లు తండ్రికి చెప్పాడు. అయితే ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనైన తండ్రి కుమారుడికి ఫోన్ చేయగా.. ఫోన్ తీయలేదు. హాస్టల్ వార్డెన్ కు ఫోన్ చేయగా.. రూమ్ లోకి వెళ్లి చూశాడు. అప్పటికే సాయి తేజ మృతి చెందాడు. సాయి తేజ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.

అయితే సాయితేజ స్నేహితులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇటీవల ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో సాయితేజ, అతని స్నేహితులకు గొడవ జరిగింది. అయితే ఈ విషయాన్ని ఫస్ట్ ఇయర్ విద్యార్థులు.. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మరో కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఫ్రెండ్స్ కలిసి సాయి తేజతోపాటు అతని స్నేహితులను పిలిచారు. ఈ వివాదంలో లోకల్‌ గా ఉండే రౌడీ బ్యాచ్ ప్రమేయం కూడా ఉంది.

Heartbreak in Medipalli Innocent Engineer s Ragging Nightmare Ends in Tragedy

మాట్లాడదాం అని సాయితేజ, అతని స్నేహితులపై దాడి చేశారు. అంతేకాక ఓ బార్ కు తీసుకెళ్లి రౌడీ బ్యాచ్, ఫైనల్ ఇయర్ విద్యార్థులు మద్యం సేవించారు. రూ. 10వేలు బిల్ అయింది. బిల్లు కట్టాలని సాయితేజను కొట్టారు. తన దగ్గర డబ్బులు లేవని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. అలా తనవద్ద రూ. 1500 మాత్రమే ఉన్నాయని ఫోన్ పే చేశాడు. ఇక అక్కడినుంచి నేరుగా హాస్టల్ వెళ్లిపోయిన సాయి తేజ.. రూమ్‌లో సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+