వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ, ఓయూలో ఉద్రిక్తత: 'గేమ్ ఆడుతున్నారు' (పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయంలోని వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో వర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అతను తమ విద్యార్థేనని కొందరు విద్యార్థులు చెబుతుండగా, కాదని పోలీసులు చెబుతున్నారని అంటున్నారు.
వాటర్ ట్యాంకులో దొరికిన మృతదేహం తమ విద్యార్థిదేనని, అతను ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. అయితే, అతను విద్యార్థి కాదని పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
చనిపోయిన వ్యక్తి వర్సిటీకి అనుకొని ఉన్న మాణికేశ్వర నగర్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారని, అది తప్పు అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకు వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళన మధ్యనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
మృతుడిని గుర్తించాం: డిసిపి
ఓయు ట్యాంకులో మృతి చెందిన వ్యక్తిని గుర్తించామని డీసీపీ చెప్పారు. ఆధార్, సెల్ ఫోన్ ఆదారంగా మృతుడిని మాణిక్యేశ్వర నగర్‌కు చెందిన సిలారి బాబుగా గుర్తించామన్నారు. విద్యార్థుల రాళ్ల దాడిలో అయిదుగురు పోలీసులకు గాయాలయ్యాయన్నారు.
పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. సిలారి బాబు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు చెందిన వాడని, అతను కూలీ అని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. చనిపోయింది నిరుద్యోగిగా విద్యార్థులు భావించారన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని స్విమ్మింగ్ ఫూల్‌లో పడి చనిపోయిన వ్యక్తి ఇతను. ఇతనిని మాణిక్యేశ్వర నగర్‌కు చెందిన వాడిగా పోలీసులు చెబుతున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వ్యక్తి మృతి నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వ్యక్తి మృతి నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓయులో విద్యార్థుల ఆందోళన దృశ్యం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వ్యక్తి మృతి నేపథ్యంలో.. పోలీసులు గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఓ కారు అద్దలు పగిలిన దృశ్యం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వ్యక్తి మృతి నేపథ్యంలో.. పోలీసులు గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల వైపు వెళ్తున్న పోలీసులు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వ్యక్తి మృతి నేపథ్యంలో.. విద్యార్థులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. లాఠీఛార్జీలో గాయపడ్డ విద్యార్థి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వ్యక్తి మృతి నేపథ్యంలో.. యూనివర్సిటీ గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications