మూడో రోజూ బ్యాంకుల వద్ద భారీ జనం: కొత్త నోట్లతో ఇక్కట్లు
వరంగల్: రద్దైన పాత నోట్ల మార్పిడి కోసం నగరంలోని బ్యాంకులకు నాలుగో రోజైన శనివారం సైతం జనాలు భారీగా తరలివచారు. మూడు రోజు క్రితం ప్రధాన మంత్రి నిర్ణయంతో చ్లొబాటు కాకుండా పోయినటువంటి రూ.500, రూ.1000 నోట్లను వెంట తెచ్చుకున్న జనంతో బ్యాంకు, పోస్టాఫీసుల్లో జనం సందడి నెకొంది. కొందరు నోట్లను మార్పిడి చేసుకోగా మరికొందరి వారి ఖాతాల్లో జమ చేసుకోవడం కన్పించింది.
జన సందోహాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బ్యాంకు, పోస్టాఫీసుల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనటు జరగకుండా బందోబస్తు కొనసాగించారు.

ఎటిఎం సెంటర్ల వద్ద క్యూ కట్టిన జనం
రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు రెండు రోజుపాటు ఏటిఎంలు బంద్ చేసినా ఆయా బ్యాంకులు శుక్రవారం ప్రారంభించారు. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతాయని వెలుడిన ప్రకటనతో జనాలు ఉదయమే ఏటిఎం సెంటర్ల వద్ద క్యూ కట్టారు. ఒక్కో సెంటర్‌లో రెండు వరకు మిషన్లు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రెండు రోజులుగా నిత్యావసరాలకు కూడా డబ్బు తీసుకోలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు ఏటీఎం సెంటర్లకు పెద్ద ఎత్తున తరలివచ్చి డ్రా చేసుకోవడం కన్పించింది.
ఏటిఎం సెంటర్ల వద్ద బ్యాంకు సెక్యూరిటీతోపాటు పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసి సజావుగా డబ్బు డ్రా చేసుకునేలా చర్యలు చేపట్టారు. కాగా, నవంబర్ 18 వరకు ఎంటిఎం సెంటర్ల నుంచి కేవం రెండు వేలు, 19 నుంచి రూ.4 వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మొత్తం పెంపుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయంతో బ్యాంకుల్లో డబ్బు ఉన్నప్పటికీ అవసరాల మేరకు డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
రూ. 2000 నోట్లతో ఇబ్బందులు
నోట్లు మార్పిడి చేసుకునేందుకు వెళ్లినవారికి బ్యాంకర్లు నూతనంగా మార్కెట్లో వచ్చిన రూ. 2000 నోట్లను ఇచ్చారు. కేవం రూ. 4వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉండటం, బ్యాంకు కొత్త రూ. 2000ల నోట్ల చెల్లింపు జరపడంతో జనాలు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications