హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని జిల్లాల్లో నేటి రాత్రి భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. తాజాగా, శుక్రవారం సాయంత్రం నుంచి కూడా వర్షం కురవనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో శుక్రవారం తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వర్షం పడే అవకాశముందని పేర్కొంది. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. అందువల్ల ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

ఇది ఇలావుండగా, హైదరాబాద్ గరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. శేరిలింగంపల్లి జోన్‌లోని హైటెక్ సిటీ, బయో డైవర్సిటీ, క్యూ మార్ట్, డీఎల్ఎఫ్ ప్రాంతాలను కమిషనర్ రోనాల్డ్ రాస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు.
వరద నీరు నిలిచిపోవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారులకు చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. వర్షం పడిన ప్రతీసారి చాలాచోట్ల పదే పదే నీరు నిలవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని మళ్లించేందుకు అవసరమైన ప్రతిచోటా బాక్స్ డ్రైయిన్లను నిర్మించాలని ఆదేశించారు.
మరోవైపు, రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications