హైదరాబాద్‌లో కుండపోత వాన: లోతట్టు ప్రాంతాలు జలమయం, జీహెచ్ఎంసీ అలర్ట్

హైదరాబాద్ నగరంలోని గురువారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాల్లోని రహదారులు వరదనీరుతో జలమయమయ్యాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సికింద్రాబాద్, బోయిన్‌​పల్లి, తిరుమలగిరి, అల్వాల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ మార్కెట్, మారేడుపల్లి ప్యాట్నీ పారడైజ్, బేగంపేట్ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. గుండ్ల పోచం పల్లి, బహదూర్ పల్లి, పెట్ బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, చింతల్ , సూరారం, జగద్గిరిగుట్ట, బాలనగర్​‌లో వాన దంచికొట్టింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Heavy Rain In Hyderabad GHMC issues alert to city people

భారీ వర్షాలతో రహదారులన్నీ జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. మోండా మార్కెట్లో ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. వరద నీటి కారణంగా ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

జీహెచ్ఎంసీ అలర్ట్: సిటీ జనులకు హెచ్చరిక

గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ కమిషనర్.. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల వద్ద మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111 లేదా డీఅర్ఎఫ్ సహాయం కొరకు 9000113667 నంబర్‌ను సంప్రదించాలని కమిషనర్ కోరారు.

నాలుగు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్ వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+