హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో వర్ష బీభత్సం: పలుచోట్ల ట్రాఫిక్ జాం, టెక్కీల అసహనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శుక్రవారం నాడు భారీ వర్షం కురుస్తోంది. అమీర్ పేజ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, హైదరాబాద్, ఖైరతాబాద్, మాదాపూర్, మణికొండ, సోమాజిగూడ, కూకట్ పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తదితర చోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అయింది.

Rain

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, చెక్ పోస్టు, మలక్ పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఆకాశానికి చిల్లులు పడిందా అన్నట్లు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా ఉద్యోగులు, ఇతరులు ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద గంటల పాటు ఫిక్ జాం అవుతోంది.

మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక్కడే సాఫ్టువేర్ కంపెనీలు చాలా ఉన్నాయి. రోడ్లు బాగా లేకపోవడంతో వారు ఇబ్బంది పడటంతో పాటు రోడ్ల మరమ్మతుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గంటల పాటు కుంభవృష్టి, నీట మునుగుతున్న వాహనాలు

హైదరాబాదులో గంటలుగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్ వే బ్రిడ్జిలు, పలు ప్రాంతాల్లో రోడ్ల పైన కార్లు, వాహనాలు సగం, అంతకంటే ఎక్కువగా మునుగుతున్నాయి. రోడ్ల పైన పెద్ద ఎత్తున వాన నీరు నిలిచింది. కొన్నిచోట్ల వాహనాల ఇంజిన్లలోకి నీళ్లు వెళ్లడంతో ఆగిపోయాయి.

English summary
Heavy Rain lashes Andhra and Telangana States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X