హైదరాబాద్‌ను వీడని వర్షం: మరోసారి రహదారులు జలమయం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: నగరాన్ని వర్షం వీడటం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యూడు మండిపోగా.. సాయంత్రం మాత్రం వర్షం అందుకుంటోంది.

గత వారం రోజులుగా నగరంలో ఈ పరిస్థితే ఉండటం గమనార్హం. గురువారం కురిసిన భారీ వర్షం నుంచి ఇంకా తేరుకోకముందే శుక్రవారం సాయంత్రం నుంచి మళ్లీ వర్షం పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హిమాయత్‌నగర్, రాంనగర్, అమీర్‌పేట, ఎస్‌.ఆర్‌.నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో జోరువాన కురిసింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Heavy rains in Hyderabad on Friday evening

భారీ వర్షం కారణంగా మదాపుర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రధాన రహదార్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపున‌కు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

మాదాపూర్‌లోని శిల్పారామం, హైటెక్ సిటీ మార్గంలో ర‌హ‌దారులు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. నగరంలోని మరికొన్ని ప్రాంతాలు కూడా వరద నీటితో నిండిపోయాయి. ఇది ఇలావుంటే నగరంలో జరగాల్సిన చివరి టీ20(టీమిండియా, ఆస్ట్రేలియా) మ్యాచ్ కూడా రద్దయిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy rains in Hyderabad on Friday evening.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి