weather update: హైదరాబాద్ తోపాటు తెలంగాణలోనిజిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నాటి ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి సోమవారం బలహీనపడింది. అల్ప పీడనం సోమవారం దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో కొనసాగుతోంది.

Recommended Video

    Hyderabad Weather : నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం | Low Pressure | Oneindia Telugu
    తెలంగాణపై అల్పపీడనం ప్రభావం..

    తెలంగాణపై అల్పపీడనం ప్రభావం..

    అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్ స్థాయి వరకు వ్యాపించింది. ఎత్తుకువెళ్లే కొద్దీ అల్పపీడనం నుంచి నైరుతి దిశగా తెలంగాణ వైపుగా ఉంది. ఆ తర్వాత ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. సోమవారం పలు ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో కూడా కొన్ని ప్రదేశాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

    వర్షాలు, ఈదురుగాలులు..

    వర్షాలు, ఈదురుగాలులు..

    సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురుగాలులు(గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో) కూడా వీయనున్నాయి. మంగళ, బుధవారాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నాయి. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోనే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    హైదరాబాద్‌లో భారీ వర్షం..

    హైదరాబాద్‌లో భారీ వర్షం..

    కాగా, సోమవారం తెలవారుజాము నుంచి ఉదయం వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, మీర్‌పేట్, సరూర్‌నగర్, మలక్‌పేట, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్‎గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, కూకట్‎పల్లి, జీడిమెట్ల, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, నాచారం, నల్లకుంట సహా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటి కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పలు చోట్ల వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+