తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. రాష్ట్రంలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలుపడే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మంగళవారంనాడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక గడిచిన 24గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుశాయి. హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications