దంచికొడుతున్న వర్షాలు; నిండుకుండల్లా కృష్ణా, గోదావరి బేసిన్ లో ప్రాజెక్టులు; లేటెస్ట్ అప్డేట్స్!!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణ, గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు మంగళవారం ఉదయానికి 60 శాతం నిండింది ఆల్మట్టి లోకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

దీంతో తుంగభద్ర కు 72 వేల క్యూసెక్కులు, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు తొమ్మిది వేల క్యూసెక్కులు చొప్పున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇక గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్ లో కడెం నుండి సమ్మక్క సాగర్ తుపాకులగూడెం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టులు బ్యారేజీ ల గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదిలేస్తున్నారు.

Heavy rains

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 75 గేట్లు ఎత్తి 5,33,970 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్ ప్లో ఔట్ ఫ్లో 5,33,970 క్యూసెక్కులు కాగా లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలుగా ఉంది.

అన్నారం సరస్వతి బ్యారేజ్ ఇన్ ప్లో 1,26,884 క్యూసెక్కులుగా ఉంది. అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద40 గేట్లు ఎత్తి 1,22,634 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజ్ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 6.569 టీఎంసీలుగా ఉంది. ఇక తుపాకుల గూడెం దగ్గర 7.29, దుమ్ముగూడేనికి 7.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది.

ఇదిలా ఉంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.31 ఎంసీలు కాగా ఇప్పటివరకు 65 టిఎంసిల నీళ్లు చేరాయి. ఈ ప్రాజెక్టులోకి 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం సామర్థ్యం 148 మీటర్ల కు గాను 146.64 మీటర్లకు నీరు వచ్చింది.

ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా 16.4883 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. జలాశయంలోకి ప్రస్తుతం 99,079 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 16 గేట్లు ద్వారా 120,107 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే గోదావరి బేసిన్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలం దగ్గర మళ్లీ నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+