బాలకృష్ణ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఏంటంటే!!
సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలకృష్ణ ఈరోజు ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన క్రమంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుంది.
దీంతో హెలికాప్టర్ లో చోటుచేసుకున్న సాంకేతిక లోపాన్ని వెంటనే గుర్తించిన పైలెట్ అప్రమత్తం అయ్యారు. వెంటనే ఒంగోలు పోలీస్ గ్రౌండ్ లో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. బాలయ్య సేఫ్ అని తెలుసుకున్న ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక హెలికాప్టర్లో హీరో బాలకృష్ణతో పాటు హీరోయిన్ శృతిహాసన్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీనియర్ దర్శకుడు బి.గోపాల్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం హెలికాప్టర్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సిబ్బంది పరిష్కరించే పనిలో ఉన్నారు. ఇక హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా హీరో బాలకృష్ణ రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు బయలుదేరినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒంగోలులోని అర్జున్ ఇన్ ఫ్రా లో నిన్న రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతికి హీరో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ విడుదలవుతోంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ లతో రచ్చ చేశారు. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య తన రాజకీయ ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేశారు. భారీ పంచ్ డైలాగులతో హంగామా సృష్టించారు. నిన్న ఒంగోలులో జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదల చేసిన ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ వింటే బాలయ్య ఎవరిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారో అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని బాలకృష్ణ టార్గెట్ చేసి పంచ్ డైలాగులతో సెన్సేషన్ క్రియేట్ చేశారని టాక్ నడుస్తుంది.












Click it and Unblock the Notifications