ఎందుకు బెదిరిస్తున్నారు?: కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గురువారం నాడు చుక్కెదురైంది. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జీవో పైన తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వం 123 జీవోను విడుదల చేసింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్ భూసేకరణ విషయమై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ కోసం రైతులను ఎందుకు బెదిరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందు రైతుల అభ్యర్థనలను పరిశీలించాలని, అప్పటి వరకు భూసేకరణను నిలిపివేయాలని ఆదేశించింది.

రైతులతో ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించింది. వట్టెం రిజర్వాయర్ భూసేకరణపై కారుకొండకు చెందిన కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఎకరానికి రూ.20-25లక్షల వరకు చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు తాము సిద్ధమని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు సంతృప్తి చెందే ధరకే భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.












Click it and Unblock the Notifications