బెంగళూర్‌ని చూడండి: నిమజ్జనంపై హైకోర్టు, ఆ మొత్తం ఉంచండి, ఏపీ బోర్డ్ ఖాతాలపై..
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం నాడు న్యాయస్థానం స్పందిస్తూ... కర్నాటక రాజధాని బెంగళూరులో నిమజ్జనం జరిగే విధానాన్ని పరిశీలించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి)ని ఆదేశించింది.
హైదరాబాదులో ప్రతి ఏటా వేలాది విగ్రహాలు నిమజ్జనం అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడాన్ని సవాల్ చేస్తూ వేణుమాధవ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అనంతరం స్పందిస్తూ.... బెంగళూరు నిమజ్జనం విధానాన్ని పరిశీలించాలని సూచించింది.

ఏపీ బోర్డు ఖాతాల నిలిపివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింప చేయాలంటూ ఎస్‌బీఐకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి లేఖ రాయడం, ఇంటర్ విద్యా మండలి వ్యాజ్యం నేపథ్యంలో.. హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ విద్యామండలి కార్యదర్శి బ్యాంకుకు రాసిన లేఖ పైన ఏపీ ఇంటర్ విద్యా మండలి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఖాతాలు స్తంభింప చేసే నాటికి ఉన్న మొత్తాన్ని అలాగే ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications