హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా - ఇక 3.5 గంటల్లోనే బెంగళూరు, చెన్నై..హాల్టింగ్స్..!!
తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో మూడు హైదరాబాద్ నుంచే ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు, చెన్న నగరాలకు ఇక మూడున్నార గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి పూణే కు మరో లైన్ కు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించి డీపీఆర్ లు ఖరారయ్యాయి. కొత్త లైన్ల ద్వారా ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుంది. మూడు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణే నగరాలకు ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రయాణీకుల నుంచి ఆదరణ పెరుగుతున్న వందేభారత్ సీటింగ్ రైళ్ల గరిష్ఠ వేగం 150 కిలోమీటర్లు కాగా, త్వరలో ప్రవేశపెట్టనున్న స్లీపర్ రైలుకు ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించగా 180 కిలోమీటర్ల వేగం అందుకుంది. ఇక, కొత్తగా ప్రకటించిన హైస్పీడ్ కారిడార్ రైలు ప్రాజెక్టులను 350 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా డిజైన్ చేస్తున్నా..ఆపరేషనల్ స్పీడ్‌ను 0గంటకు 320 కిలోమీటర్లుగా ఖరారు చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే నగరాలకు రైల్లో చేరుకునేందుకు 12 నుంచి 15 గంటల సమయం పడుతుండగా, హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే మూడున్నార గంటల్లోనే చేరుకునే వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రతిపాదిత మార్గాలు
హైస్పీడ్ రైళ్లకు జిల్లా కేంద్రాలు.. పట్టణాల్లోనూ హాల్టింగ్ సౌకర్యం ప్రతిపాదించారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో హైస్పీడ్ రైళ్లు ఆగనున్నాయి. ఏపీలో చీరాల, కావలి, గూడూరు వంటి పట్టణాల్లోనూ స్టేషన్లు నిర్మించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్-ముంబయి హైస్పీడ్ కారిడార్ డీపీఆర్ సిద్దం చేసారు. కాగా, తాజాగా బడ్జెట్ లో ప్రతిపాదనల మేరకు కొత్తగా హైదరాబాద్-పుణే, పుణే-ముంబయి పేరిట రెండు హైస్పీడ్ కారిడార్లుగా విభజించింది. అదే విధంగా హైదరాబాద్ -చెన్నై ఎలైన్‌మెంట్‌ను ఏపీలో అమరావతి మీదుగా రైల్వే ప్రతిపాదించింది. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో శంషాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్ మీదుగా రైల్వే శాఖ హైస్పీడ్ కారిడార్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించేందుకు మరి కొంత సమయం తీసుకోనుంది. తాజా ప్రాజెక్టులతో హైదరాబాద్‌కు బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాలకు మరింత వేగంగా చేరుకునే విధంగా కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications