గృహ ప్రవేశానికి రూ. 50 వేలు డిమాండ్.. ఇంట్లోకి రానివ్వకుండా హిజ్రాలు రచ్చ రచ్చ.. బాధితురాలి ఆవేదన..!

సాధారణంగా పెద్ద నగరాల్లో గృహ ప్రవేశానికి హిజ్రాలు వస్తుంటారు. వారికి నగదు ఇస్తే మంచి జరుగుతుందని యజమాని విశ్వాసం. రూ. 500 నుంచి వారికి తోచినంత హిజ్రాలకు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. అడిగినంత డబ్బులు ఇచ్చేంత వరకూ అక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదని మొండికేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే కొత్త ఇంట్లోనే వారికి శాపనార్థాలు పెడుతున్నారు. అంతేకాక బూతులు తిడుతూ నానా హైరానా చేస్తున్నారు. ఎంతో సందడిగా పండుగలా జరుపుకోవాల్సిన శుభకార్యాల వద్దకు హిజ్రాలు గుంపులు గుంపులుగా చేరుకుని వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.

తాజాగా హైదరాబాద్ లోని చింతల్ లో ఓ గృహ ప్రవేశం కార్యక్రమంలో హిజ్రాలు గుంపులు గుంపులుగా వచ్చి హల్ చల్ చేశారు. ఈ మేరకు ఓ మహిళ తమ గృహ ప్రవేశ వేడుకలో ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. " సంతోషంగా గృహ ప్రవేశం చేయాలనుకుంటే ఫేస్ ఏడుపు మొహం పెట్టి గృహ ప్రవేశం చేయడానికి కారణం వీళ్లే. ఎంత డిమాండ్ చేస్తున్నారంటే..? మీరు గిఫ్ట్ గా ఏదో అడగండి.. వచ్చాం కదా.. తలా ఒక వేయి రూపాయలు ఇవ్వండనో ఏదో అడగండి. వాళ్లకు రూ. 50 వేలు ఇవ్వాలంట. ఏయ్ అంటూ మర్యాద లేకుండా ప్రవర్తించారు.

Hijras create a ruckus in Hyd Victim expresses her anguish Rs 50 000 demanded for housewarming

ఏయ్.. వీడియో ఆపు అంటూ బెదిరింపులకు దిగారు. అందరూ నాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంత మంచి గృహ ప్రవేశం పెట్టుకుంటే వీళ్ల చెత్త గోల ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ల డిమాండ్ ఎందుకో.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు. మిగతావాళ్లు అందరూ ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియట్లేదు.

ఇంటి దగ్గరినుంచే ఫాలో అవుతూ వచ్చారు. కానీయండి.. త్వరగా పదండి అని ముందే ఇంట్లోకి వచ్చి మాకు రూ. 50 వేలు ఇస్తేనే లోపలికి రానిస్తాం.. లేదంటే రానివ్వము.. అని డిమాండ్ చేశారు. అంతేకాక వాళ్ల డ్రెస్ మొత్తం పైకి లేపారు. మనం కష్టపడి కొనుక్కున్న ఇంటిలో వీళ్ల గోల ఏంటో అర్థం కావట్లేదు. హైదరాబాద్ మొత్తం ఇలానే ఉందా..? లేక చింతల్ లోనే ఇలా ఉందా..? అర్థం కావట్లేదు.. అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+