బాలికపై హోంగార్డ్ రేప్: ఆ మహిళలిద్దరు కల్లు తాగారు, హతమయ్యారు

హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై హోంగార్డు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఈ దారుణం జరిగింది. పూడూరు మండలం, కండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

ఈనెల 22న వికారాబాద్‌ పట్టణానికి చెందిన ఓ మైనర్‌ బాలికపైన శ్రీనివాస్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు శ్రీనివా్‌సను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

rape

ఇద్దరు మహిళల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్స్ వర్కర్లుగా అనుమానిస్తున్న ఇద్దరు మహిళలు రంగారెడ్డి జిల్లాలోని జవహర్‌నగర్‌లో శవాలై తేలిన విషయం తెలిసిందే. సూరారానికి చెందిన లక్ష్మి(25), ధనలక్ష్మి(28) మానసిక చికిత్స కోసం కౌకూరు దర్గాకు ఈనెల 22న వచ్చారు. ఈ గ్రామంలో ఆంధ్రాబ్యాంకు పక్కనే గుర్రాల మల్లేశ్‌ యాదవ్‌ కుటుంబంతో కలిసి ఉంటున్నారు.

ఇద్దరు యువతులు బుధవారం ఆయన ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలో వారి వివరాలు కావాలని మల్లేశ్‌ అడగాడు. తాము యశోదా ఆసుపత్రిలో పనిచేస్తున్నానని లక్ష్మి తెలిపింది. సోమవారం అద్దె అడ్వాన్సు మొత్తాన్ని చెల్లిస్తానని తెలిపింది. బుధవారం బయటికి వెళ్లిన ఇద్దరు యువతులు కల్లు తాగి సాయంత్రం గదికి తిరిగి వచ్చి పడుకున్నారు.

మర్నాడు ఈ నెల 23వ తేదీ ఉదయం ఇంటి యజమాని మల్లేశ్‌ యువతులతో మాట్లాడేందుకు వెళ్లగా, ఆ ఇద్దరు తాగిన మైకంలో ఉన్నారు. గదిని కకావికలం చేశారు. గుట్కాలు నమిలి ఇంట్లోనే ఉమ్మేశారు. దీంతో మల్లేశ్‌ వారిని మందలించి గదిని ఖాళీ చేయించారు. గది ఖాళీ చేసి వెళ్లిన ఇద్దరు యువతులు గురువారం సాయంత్రం వరకు దర్గా పరిసర ప్రాంతాల్లోనే తిరిగారని అంటున్నారు.

శుక్రవారం ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. గురువారం సాయంత్రం కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులెవరైనా హత్య చేశారా, లేదా తెలిసిన వ్యక్తులే యువతులను హతమార్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందంతో ఆధారాలను సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+