ట్రైనీ నర్సుపై ఆస్పత్రి సూపరింటెండెంట్ అసభ్య ప్రవర్తన; నడిరోడ్డుపైనే ఉతికారేసిన నర్సు కుటుంబం

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధులు వాటిని పట్టించుకోలేదు. చదువుకున్నవారు చదువులేని వారు అన్న తేడా లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాడు కీచకులు అనేకమంది సొసైటీలో మన చుట్టూనే ఉన్నారు. శిక్షణలో ఉన్న నర్సింగ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి తన కోరిక తీర్చాలని వేధించిన ఒక డాక్టర్ బండారం ఆమె కుటుంబ సభ్యులు సదరు డాక్టర్ కు దేహశుద్ధి చేయడంతో వెలుగులోకి వచ్చింది.

ట్రైనీ నర్సుపై సూపరింటెండెంట్ అసభ్య ప్రవర్తన

ట్రైనీ నర్సుపై సూపరింటెండెంట్ అసభ్య ప్రవర్తన

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో కల్హేర్ మండలం గిరిజన తండాకు చెందిన యువతీ ట్రైనీ నర్సుగా శిక్షణ పొందుతున్నారు. ట్రైనింగ్ లో ఉన్న నర్సు సునీతను నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న నర్సింగ్ చౌహన్ వేధింపులకు గురి గురిచేసిన ఘటన చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో ట్రైనింగ్ లో ఉన్న నర్సు పట్ల సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహన్ అసభ్యంగా ప్రవర్తించాడని సునీత ఆరోపిస్తోంది.

బావ వరుస అవుతా అని చెప్పి లొంగదీసుకునే యత్నం

బావ వరుస అవుతా అని చెప్పి లొంగదీసుకునే యత్నం


విధులు ముగించుకుని వెళ్తున్న క్రమంలో కాసేపు ఆగమని, తర్వాత వెళ్ళొచ్చు అంటూ ఆపి తన చాంబర్ కు పిలిపించుకొని మాయమాటలతో లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని చెబుతోంది. వ్యక్తిగత విషయాలు అడిగి తెలుసుకుని బావ వరుస అవుతానని చెంపలపై చేతులు వేసి చిరాకుగా ప్రవర్తించారని ఆమె పేర్కొంది. ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో, అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశానని చెప్పింది నర్సు సునీత. అయితే ఈ క్రమంలో ఆమె ఎంతకీ లొంగకపోవడంతో డాక్టర్ నర్సింగ్ చెంపపై కొట్టాడని సునీత వెల్లడించింది.

 భర్తతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పిన నర్సు .. డాక్టర్ ను ఉతికారేసిన కుటుంబం

భర్తతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పిన నర్సు .. డాక్టర్ ను ఉతికారేసిన కుటుంబం

ఇక ఆసుపత్రి సూపరిండెంటెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని భర్తతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా నారాయణ ఖేడ్ చేరుకున్నారు. సునీత తో ఓ షాపింగ్ మాల్ వద్దకు రమ్మని సూపరింటెండెంట్ కు ఫోన్ చేయించారు. నర్సు ఫోన్ కాల్ తో డాక్టర్ అక్కడికి వచ్చారు. ఇక అక్కడ నర్సు భర్తతో పాటు బంధువులు డాక్టర్ పై దాడికి దిగారు. అక్కడ నుండి ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి మరీ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ను బయటకు లాగి దేహశుద్ధి చేశారు. చెప్పులతో కొడుతూ, బట్టలు చించి డాక్టర్ పై దాడి చేశారు. నడిరోడ్డుపై డాక్టర్ ను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కీచక డాక్టర్ ను పోలీసులకు అప్పగించారు.

 కేసు నమోదు .. కీచక డాక్టర్ సస్పెండ్ .. జరుగుతున్న విచారణ

కేసు నమోదు .. కీచక డాక్టర్ సస్పెండ్ .. జరుగుతున్న విచారణ

బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణఖేడ్ ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు గా వెల్లడించారు. ఇక శిక్షణ పొందుతున్న నర్సింగ్ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించి నర్సింగ్ చౌహాన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అతనిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ సంగారెడ్డి ని ఉన్నతాధికారులు ఆదేశించారు. శుక్రవారం ఆస్పత్రిలో చౌహాన్ పై విచారణ జరుపుతున్నారు ఉన్నతాధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+