బర్రె గుద్దితే వందే భారత్‌ రైలు పచ్చడైంది- కేసీఆర్ మార్క్ సెటైర్స్

అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో వందే భారత్ రైలు గురించి ప్రస్తావించారు. ఒక్క రైలును ప్రధాని మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని నిలదీశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ముగిశాయి. ఏడు రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను స్పృశించారు. ఈ క్రమంలో ఆయన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

బడ్జెట్ కేటాయింపులపై..

బడ్జెట్ కేటాయింపులపై..

తన ప్రసంగంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నిప్పులు చెరిగారు. అంశాలవారీగా సమస్యలను ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్‌ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తేల్చి చెప్పారు. ఈ బడ్జెట్ లో దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రకటించగా.. ఇందులో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రధాని చెప్పుకొనే ఫెడరల్ వ్యవస్థ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన 470 కోట్ల రూపాయలను ఏపీకి బదలాయించారని, వాటిని చెల్లించాలంటూ తాము ఏడేళ్లుగా అడుగుతున్నామని అన్నారు.

మేకిన్ కాదు.. జోకింగ్..

మేకిన్ కాదు.. జోకింగ్..

ప్రధాని మోదీ ప్రతిపాదించిన మేకిన్ ఇండియా కాస్త జోకింగ్ ఇండియాగా మారిపోయిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ విధానమైనా విజయవంతం అయిందా? అంటూ నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు గతి ఏమైందో అందరికీ తెలుసునని అన్నారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల పేరుతో ఆర్థిక మోసగాళ్లకు చెందిన లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశారని మండిపడ్డారు.

20 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు..

20 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు..

లక్షలాది మంది నివసించే ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు కూడా ఇవ్వట్లేదని, దీనికి కారణం- బీజేపీయేతర ప్రభుత్వం కావడమేనని కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేసుకున్నారంటే ఇంత కంటే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్‌ ర్యాంక్‌ తక్కువగా నమోదైందని, మొత్తం 192 దేశాల్లో 139వ స్థానంలో నిలిచిందని చెప్పారు.

బర్రె గుద్దితే..

బర్రె గుద్దితే..

దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు వచ్చి ఒక డీలర్‌తో కొట్లాడటం ఏమిటని కేసీఆర్ అన్నారు. మోదీ ఏం సాధించాడని రేషన్ దుకాణాల్లో మోదీ ఫొటో పెట్టాలని ప్రశ్నించారు. ఒక్క వందే భారత్‌ రైలును ప్రధాని మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని నిలదీశారు. బర్రె గుద్దితే వందే భారత్‌ రైలు పచ్చడైందంటూ గుజరాత్ లో చోటు చేసుకున్న ఉదంతాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.

మోదీ చేతుల మీదే..

మోదీ చేతుల మీదే..

ఇప్పటివరకు దేశంలో 10 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వాటన్నింటినీ ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా, గాంధీనగర్- ముంబై, న్యూఢిల్లీ- ఏఎంబీ అందౌరా, చెన్నై- మైసూరు, నాగ్‌ పూర్- బిలాస్ పూర్, హౌరా-న్యూ జల్ పాయ్ గురి, సికింద్రాబాద్-విశాఖపట్నం, ముంబై షోలాపూర్, ముంబై-షిర్డీ మధ్య వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వాటన్నింటినీ మోదీ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+