తెలంగాణ జిల్లాల నుంచి భారీ జాయినింగ్స్..! నాపంల్లిలో రేపే బీజేపి భారీ బహిరంగ సభ..!!

Recommended Video

    విజయవంతంగా నాంపల్లి లో బీజేపి భారీ బహిరంగ సభ || Huge Joinings From Telangana Districts To BJP

    హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల మీద దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై దూకుడు పెంచింది బీజేపి. ఇందులో బాగంగానే నాంపల్లి ఎగ్సిబీషన్ మైదానంలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నాయకులందరికి కాషాయ కండువా కండువా కప్పాలని ప్రణాళిక రచిస్తోంది బీజేపి. రాష్ట్రానికి సంబందించిన వివిధ పార్టీలలోని నేతలతో పాటు టీడీపీ శ్రేణులంతా బీజేపీలో చేరేలా ఆపరేషన్‌ కమలం చేపడుతోంది.

    టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటీవల టీడీపీ సీనియర్‌ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, నందీశ్వర్‌గౌడ్‌ ఇళ్లకు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెళ్లి మరీ ఆహ్వానించారు. మరోవైపు రేపు ఆదివారం రోజున భారీ ఎత్తున టీడీపీ శ్రేణులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపి. ఈ కార్యక్రమానికి బీజేపి జాతీయ కార్యనిర్వాహక అద్యక్షుడు జేపి నడ్డా ముఖ్య అతిదిగా హాజరుకాబోతున్నారు.

     Huge joinings from Telangana districts.!BJP public Meeting in Nampally tomorrow..!!

    రాష్ట్రంలోని ప్రధానమైన జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతోపాటు క్షేత్రస్థాయిలోని టీడీపీ శ్రేణులందరినీ బీజేపీలో చేర్చుకునేలా చర్యలు చేపట్టింది. టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు సీనియర్‌ నేతలు త్వరలోనే బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. పార్టీ జాతీయ నేతలతో కొందరు నేతలు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

    అందులో రాములమ్మ, దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, మాజీమంత్రి చంద్రశేఖర్‌ తదితరులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. వారు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలైన మరికొంత మందినేతలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని, 25 వేలమందితో సభ నిర్వహించబోతున్నామని బీజేపి రాష్ట్ర పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+