కేసీఆర్ కు డబుల్ ట్రబుల్ - బీఆర్ఎస్ లో కొత్త టెన్షన్..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అనేక మలుపులు తీసుకుంటోంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ గా మారిన ఎన్నికల పోరులో బీజేపీ తాజా ప్రకటనలతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ తో పాటుగా పెద్ద సంఖ్యలో ఈ రెండు నియోజకవర్గాల నుంచి దాఖలైన నామినేషన్లు బీఆర్ఎస్ కు కొత్త సమస్యగా మారాయి.
భారీగా నామినేషన్లు : తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రచార పర్వం పతాక స్థాయికి చేరింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, నామినేషన్లలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో, గజ్వేల్‌లో నామినేషన్లతో బీఆర్‌ఎస్‌కు కొత్త టెన్షన్ ఎదురైంది. నామినేషన్లపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్‌పై నామినేషన్లు వేసిన బాధితులను నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

కేసీఆర్ పై పోటీ కోసం : ఇక, నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన గులాబీ పార్టీ నేతలు వారిని విత్‌డ్రా చేసుకోవాలని బుజ్జగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది 5,716 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు. 116 నామినేషన్లతో మేడ్చల్ సెకండ్ ప్లేస్, కామారెడ్డిలో 92 మంది 104 నామినేషన్లు వేశారు.

బరిలో మిగిలేదెవరు : అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు వేశారు. వైరా, మక్తల్‌లో కూడా 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో గజ్వేల్ రాజకీయం రసవత్తరంగా మారింది. గజ్వేల్ లో కేసీఆర్ పైన బీజేపీ నేత ఈటల రాజేందర్.. కామారెడ్డిలో కేసీఆర్ తో టీపీసీసీ చీఫ్ రేవంత్ పోటీ పడుతున్నారు. దీంతో, ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయటంతో ఉపసంహరణ సమయం ముగిసే సరికి ఎవరెవరు పోటీలో ఉంటారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications