వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇంట్లో భారీ చోరీ: 15లక్షలు, 70వేల నగదు మాయం..
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎంపీ ఇంట్లో వారు చోరీ చేశారు. చోరీలో 15 లక్షల విలువైన బంగారం, 70 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.

దొంగతనం సమయంలో దొంగలు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇంట్లోని సీసీ కెమెరాలను పగలగొట్టి చోరీ దృశ్యాలు రికార్డవకుండా జాగ్రత్తపడ్డారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే చోరీ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ నగేశ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉన్నారు. చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!