కామారెడ్డి : నగ్నంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి మహిళ.. ఆ వివాదమే కారణం..
కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జందగపల్లిలో దారుణం జరిగింది. ఓ భూ వివాదానికి సంబంధించి ఓ దంపతులు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా.. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది.
ఈ క్రమంలో ఆ వ్యక్తులు ఆ మహిళపై దాడి చేసి బలంగా వెనక్కి నెట్టారు. దాంతో ఆమె పట్టు తప్పి రోడ్డుపై పడిపోగా... తలకు గాయమైంది. జరిగిన ఘటనను తీవ్ర అవమానంగా భావించిన ఆమె.. ఒంటిపై దుస్తులు విప్పేసి... నగ్నంగా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరింది.

పట్టణంలోని అంగడి బజార్ మీదుగా ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని,బట్టలు తీసుకొచ్చి ఇచ్చారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి భర్త అమీనుద్దీన్ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications