బాత్ రూమ్ శుభ్రత విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ.. సూసైడ్ చేసుకున్న భార్య
ఇటీవల కాలంలో చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకరినొకరు అర్థం చేసుకుని దాంపత్య జీవితాన్ని కొనసాగించాల్సిన భార్యాభర్తలు, చిన్న చిన్న మనస్పర్థలకు, కాస్త మాట తేడా వచ్చినందుకు ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితులు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో అలాంటి సంఘటన జరిగింది.

బాత్ రూమ్ శుభ్రత విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ
వివరాల్లోకి వెళితే కూకట్ పల్లి లోని న్యూ బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న నవీన్, శృతి దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు వయసు ఆరేళ్లు, చిన్న బాబు వయసు ఏడాదిన్నర ఉంటుంది. నవీన్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా, శృతి గృహిణిగా ఉంది. అయితే భార్య భర్తల మధ్య కాపురం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేకపోయినా, బాత్ రూమ్ క్లీనింగ్ విషయంలో వారిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ శృతి ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్ళింది.

భర్త మాటలు అవమానంగా ఫీలై ఆత్మహత్య చేసుకున్న భార్య
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన నవీన్ బాత్రూం కి వెళ్ళాడు. మూత్ర విసర్జనకు వెళ్ళిన నవీన్ సరిగా నీళ్లు పోయకపోవడంతో, నవీన్ ను శృతి గట్టిగా నిలదీసింది. నీళ్ళు సరిగా పోయలేదని అడిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్తా ముదిరి చిలికి చిలికి గాలివానగా మారి భర్త మాటలను అవమానంగా భావించిన శృతి ఇంటి పైన ఉన్న గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

శృతి మృతితో ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాధలుగా
చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకున్న శృతి ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. అయిన వారందరికీ శోకాన్ని మిగిల్చింది. తనకు నచ్చని విషయాల్లో భర్తను మార్చుకునే ప్రయత్నం చేయకపోగా, ఆత్మహత్యకు పాల్పడి అనవసరంగా ప్రాణం తీసుకుంది. అర్ధాంతరంగా తన జీవితానికి శృతి ముగింపు పలికింది. భార్య భర్తలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి తప్పులను ఒకరు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా చిన్న విషయాలకే గొడవపడి, రాద్ధాంతం చేసి, ప్రాణాలు తీసుకునే దాకా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.

సమస్యలు వస్తే ఆలోచించి పరిష్కరించుకోవాలి
నగర జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గుతోందని, అందుకే వారి వద్ద ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా పెద్ద సమస్యగా కనిపిస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినా వాటిని సానుకూలంగా ఆలోచించి పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకునే దాకా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. క్షణికావేశం మంచిది కాదని చెప్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications