భార్య వేధిస్తోందని భర్త సూసైడ్, పోకిరీని పట్టించింది
హైదరాబాద్: భార్య, ఆమె బంధువులు వేధిస్తున్నారని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో జరిగింది. రత్నాకర్, ఆయన భార్య కర్నూలులోని ఓ బ్యాంకులో పని చేస్తున్నారు. రత్నాకర్ సెలవు పెట్టి గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాడు.
భార్యాభర్తల మధ్య గొడవలు ఉండటంతో ఇటీవలె దిల్‌సుఖ్ నగర్లోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. శనివారం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, ఆమె బంధువుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వేధిస్తున్న యువకుడిని పట్టించిన యువతి

తనను వేధిస్తున్న యువకిడిని ఓ యువతి సినీ ఫక్కీలో పోలీసులకు పట్టించింది. నెల రాజా అనే వ్యక్తి ఎంటెక్ చేస్తున్నాడు. ఖమ్మంకు చెందిన ఓ యువతి గతంలో ఇదే ప్రాంతంలో ఉండి తన స్వగ్రామానికి వెళ్లింది. అయితే, ఆమె ఫోన్ నెంబర్ను తీసుకున్న నెల రాజా ఆమెను వేధిస్తున్నాడు.
ఆమెకు ఫోన్ చేసి అపరిచితుడిగా పరిచయం చేసుకున్నాడు. నిత్యం వేధిస్తుండటంతో.. ఆమె పథకం వేసింది. యువకుడు చెప్పినట్లుగా శనివారం ఉదయం నగరంలోని ఎల్బీ నగర్‌కు వచ్చింది. అయితే, అక్కడకు వచ్చిన యువకుడిని ఆమె పోలీసులకు పట్టించింది.












Click it and Unblock the Notifications