వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాతో భర్త మృతి .. తట్టుకోలేక బిల్డింగ్ పై నుండి దూకి భార్య ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

ఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. సంతోషంగా బ్రతుకు తున్న వారి కాపురంలో కరోనా చిచ్చు పెట్టింది. కరోనా సోకిన భర్త మృతి చెందగా, భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య బిల్డింగ్ పైనుండి దూకి సూసైడ్ చేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని నేరెడ్ మెట్ లో చోటు చేసుకున్న ఈ విషాదం స్థానికులను ఆవేదనకు గురి చేసింది.

కరోనా రోగి మృతదేహానికి పోస్ట్ మార్టం.. 18గంటల పాటు జీవించే ఉన్న వైరస్ , లెదర్ బంతిలా ఊపిరితిత్తులుకరోనా రోగి మృతదేహానికి పోస్ట్ మార్టం.. 18గంటల పాటు జీవించే ఉన్న వైరస్ , లెదర్ బంతిలా ఊపిరితిత్తులు

మేడ్చల్ జిల్లా నేరెడ్ మెట్ సైనిక్ పురి అంబేద్కర్ నగర్ కు చెందిన తడకమళ్ళ వెంకటేష్ వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కరోనా కారణంగా బంధు మిత్రులు ఎవరు వారి ఇంటికి రావాలంటేనే భయపడ్డారు . అయితే వెంకటేష్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించటంతో ఆయన మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది భార్య ధనలక్ష్మి . భర్త లేకుండా బ్రతలేనని భావించింది .

Husband died with Corona .. Wife committed suicide by jumping from the building

వెంకటేష్ డెడ్ బాడీ ఇంట్లో ఉండగానే బిల్డింగ్ పైనుండి దూకి ప్రాణాలు తీసుకుంది. నేరెడ్ మెట్ పోలీసులు ఇద్దరు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి, కరోనా నిబంధనల మేరకు అంత్యక్రియలు జరిపించారు. భర్త లేకుంటే ఉండలేని భార్య , భర్త మరణంతో, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

భార్యాభర్తల మధ అనుబంధానికి అర్ధం మరచిపోతున్న వారు ఉన్న నేటి రోజుల్లో చావులోనూ నిన్ను వీడను అంటూ భర్తపై భార్య చూపించిన ప్రేమ నిరుపమానం .

English summary
Tadakamalla Venkatesh of Nared Met Sainik Puri Ambedkar Nagar in Medchal district has been suffering from corona for a week. He stays at home and receives treatment. Suddenly he fell seriously ill and died. Unable to bear the death of her husband, wife Dhanalakshmi jumped from the building and took her life
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X