అనుమానం: భార్యను అతికిరాతకంగా చంపిన భర్త (ఫోటోలు)
హైదరాబాద్: అనుమానంతో భార్యను అతికిరాతకంగా హత్యే చేశాడు ఓ భర్త. ఈ సంఘటన మంగల్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోడేకిఖబర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గోడేకిఖబర్ ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ శర్మ వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతడికి 14 ఏళ్ల క్రితం సరిత శర్మ (34)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు హర్షిత, రిషిత ఉన్నారు.
కాగా, కొంత కాలంగా సరిత తరచు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయడం గమనించిన రాజేష్ శర్మ పలుమార్లు భార్యను హెచ్చరించారు. బుధవారం అనుమానంతో పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయాడు.

అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త
మధ్యాహ్నం ప్రాంతంలో సరిత ఎవరితోనో ఫోన్‌లో మాట్డాడటం గమనించి, ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరాడు. భార్య నిరాకరించడంతో ఇరువురి మధ్య గోడవ చొటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రాజేష్ శర్మ పక్కనే ఉన్న ఇనుపరాడ్‌తో సరిత తలపై బాదాడు.

అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త
దీంతో ఆమె కుప్పకూలి రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. స్దానికుల సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా వేలి ముద్రలను సేకరించారు.

అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త
సరిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలాగే పశ్చిమ మండలం డీసీపీ, గోషామహల్ ఇన్ చార్జి ఏసీపీ కూడా సంఘటనా స్ధలానికి చేరుకుని, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త
కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా, రాజేష్ శర్మ మంగళవారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్యను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.












Click it and Unblock the Notifications